అవసరం లేకపోయినా..ఆపరేషన్లు చేసిన డాక్టర్..465 ఏళ్ల జైలుశిక్ష విధించిన కోర్టు

  • Published By: nagamani ,Published On : November 13, 2020 / 11:36 AM IST
అవసరం లేకపోయినా..ఆపరేషన్లు చేసిన డాక్టర్..465 ఏళ్ల జైలుశిక్ష విధించిన కోర్టు

Updated On : November 13, 2020 / 11:53 AM IST

US Virginia doctor to 456 years in prison : చిన్న రోగాలకు మందులిస్తే సరిపోతుంది. కానీ అర్జంట్ గా ఆపరేషన్ చేయాలి..లేకపోతే చచ్చిపోతారు లేదా పెద్ద సమస్యలకు దారి తీస్తుందని భయపెట్టేసి..ఆపరేషన్లు చేసి పారేస్తున్న ఓ డాక్టర్ కు జైలుశిక్ష విధించింది న్యాయస్థానం. మెడిసిన్స్ తో తగ్గిపోయే చిన్న చిన్న రోగాలకు కూడా ఆపరేషన్లు చేసిన డాక్టర్ కు అమెరికా కోర్టు ఏకంగా 465 ఏళ్ల జైలుశిక్షను విధించింది. ఈ డాక్టర్ ఆపరేషన్ చేసినవారిలో ఎక్కువమంది మహిళలే కావటం గమనించాల్సిన విషయం.



ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ కు వెళ్లాలంటేనే భయపడిపోతున్న పరిస్థితి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా టెస్టులు..స్కానింగ్ లు రాసేసి డబ్బులు పిండేస్తున్నారు డాక్టర్లు. ఇక ఆపరేషన్ అవసరమయ్యే రోగాలైతే ఇక చెప్పుకోనక్కర్లేదు ఆస్తులు అమ్ముకోవాల్సిందే వారు వేసిన బిల్లులు కట్టటానికి. దీంతో ఏ కష్టమొచ్చినా ఫరవాలేదు అనారోగ్యం రాకుండా ఉండేబాగుండు దేవుడా అని దణ్ణం పెట్టుకుంటున్నారు జనాలు. అవసరం లేకపోయినా 52మందికి ఆపరేషన్లు చేసిన ఓడాక్టర్ కు వందల సంవత్సరాల జైలుశిక్ష విధించిన ఓ డాక్టర్ కేసుకు యూఎస్ వేదికైంది.



వివరాల్లోకి వెళితే..యూఎస్ లోని వర్జీనియాలో డాక్టర్ పేరు జావేద్ పర్వేజ్ కు డబ్బు పిచ్చి. తన దగ్గరకు వచ్చే పేషెంట్లకు అసవరం లేకపోయినా టెస్టులు, స్కానింగ్ లు చేసేస్తుంటాడు. అంతటితో ఊరుకోకుండా ఆ రిపోర్ట్స్ చూసి ‘‘నీకు అర్జంట్ గా ఆపరేషన్ చేయాలి..లేకపోతే ప్రాణాలకు ప్రమాదం..ఈరోగం క్యాన్సర్ కు కారణమయ్యే అవకాశాలున్నాయి’’ అంటూ భయపెట్టేస్తాడు. దీంతో భయపడిపోయిన ఆ పేషెంట్లు వెంటనే జావేద్ దగ్గరే ఆపరేషన్ చేయించుకునేవారు. అలా 52మందికి అవసరం లేకపోయినా ఆపరేషన్లు చేసేవాడు జావేద్ పర్వేజ్.



జావేద్ ఆపరేషన్ల పరంపరలో ఎక్కువగా మహిళలే ఉన్నారు. మహిళలు గైనిక్ సమస్యలతో వస్తే చాలు వారికి మీ గర్భసంచి పాడైపోయింది. వెంటనే ఆపరేషన్ చేసి రిమూ చేయకపోతే క్యాన్సర్ లో పెట్టేస్తుందని భయపెట్టి చాలామంది మహిళలకు ఆపరేషన్లు చేశాడు. అలా 10 సంవత్సరాల్లో 52 మందికి అనవసర ఆపరేషన్లు చేసి భారీగా డబ్బులు గుంజాడు. ఈ విషయాన్ని 29 మంది మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయగా అతనిపై కేసు నమోదు చేసి న్యాయస్థానంలో ప్రవేశ పెట్టగా కోర్టు అతనికి 465 ఏళ్ల జైలుశిక్ష విధించింది.


డాక్టర్ జావేద్ డబ్బు కోసం ఆశపడి ఇలా అనవసర ఆపరేషన్లు చేసినట్లుగా తేలింది. ఆపరేషన్ల పేరిట ప్రభుత్వ, ప్రైవేటు బీమా సంస్థల నుంచి లక్షల్లో డబ్బులు రాబట్టుకున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలగా ఆ సాక్ష్యాధారాలన్నీ కోర్టులో ప్రవేశపెట్టారు. డాక్టర్ చేసి 52 ఆపరేషన్లలో 29 మంది మహిళలకు గర్భసంచి రిమూవ్ ఆపరేషన్ చేశాడు. వీరి ఫిర్యాదుతో డాక్టర్ బాబు జైలుపాలయ్యాడు. పోలీసులు దర్యాప్తులో డాక్టర్ జావేద్ డబ్బు దురాశ నిజమేనని వెల్లడైంది.




దాంతో వర్జీనియా న్యాయస్థానం అన్ని అభియోగాలను నిజమేనని నిర్ధారించి 465 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఒక మనిషి అన్ని సంవత్సరాలు బ్రతకటమే జరగదు. కానీ అతను చేసిన నేరం అంత తీవ్రంగా ఉందని ధర్మాసనం భావించి అన్ని సంవత్సరాల జైలుశిక్షను విధిచింది.