గజనీ..వాట్‌ యాన్‌ ఐడియా సర్‌జీ :  ఐడీ కార్డే పచ్చబొట్టు 

  • Published By: veegamteam ,Published On : February 24, 2019 / 06:17 AM IST
గజనీ..వాట్‌ యాన్‌ ఐడియా సర్‌జీ :  ఐడీ కార్డే పచ్చబొట్టు 

Updated On : February 24, 2019 / 6:17 AM IST

వియత్నాం : చాలా సందర్భాలలో కొన్ని ఇంపార్టెంట్  విషయాలను మరచిపోతుంటాం. ఈ మతిమరుపుతో  వచ్చే సమస్యలు ఎన్నో. హీరో సూర్య నటించిన గజనీ సినిమాలో మతిమరుపు సమస్య వల్ల ఒంటినిండా పచ్చబొట్లు వేయించుకుంటాడు. నిజజీవితంలో కూడా అటువంటి గజనీలు ఉంటారు. అదిగో అటువంటివాడే మన గురుడు..
 

అన్ని విషయాలను గుర్తు పెట్టుకోవటం సాధ్యం కాదు. కానీ అన్నింటికీ ఓ ఉపాయం ఉంటుంది. వియత్నాంకు చెందిన ఓ  వ్యక్తి ఐడియా చూస్తే వాటే ఐడియా సర్ జీ అనాలనిపిస్తుంది. ఎప్పుడూ తన ఐడీ కార్డ్  మర్చిపోతున్నాడట. దీంతో రోజూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. చివరకు తన ఫ్రెండ్స్ తో బార్‌కు వెళ్లినప్పుడు మంద్ (ఆల్కహాల్)కావాలంటే ఐడీ కార్డ్ అడుగుతున్నారనీ..విసుగొచ్చిన గజనీ బాబు..ఓ ఐడియా కనిపెట్టాడు.

అదే చేతిపై ఐడీ కార్డ్ ను పచ్చబొట్టుగా వేయించుకోవాలనుకున్నాడు. లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా ఆ యువకుడు వెంటనే పచ్చబొట్లు వేసే వ్యక్తి వద్దకు వెళ్లి తన చేతిపై ఐడీకార్డు మొత్తం పచ్చబొట్టుగా పొడిపించేసుకున్నాడు.  యువకుడి చేతిపై ఉన్న పచ్చబొట్టును చూసిన స్నేహితులు ఫొటో తీసి దాన్ని సోషల్‌ మీడియాలో పెట్టారు. అంతే ఈ ఫొటో ఇప్పుడు వైరల్‌ అయింది. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లు..మతిమరుపులోంచి వచ్చింది..ఈ పచ్చబొట్టు ఆలోచన.