పైలెట్ సమయస్ఫూర్తి : విమాన ప్రమాదం జరగకుండా ఆపేశాడు

  • Published By: veegamteam ,Published On : January 7, 2020 / 07:18 AM IST
పైలెట్ సమయస్ఫూర్తి : విమాన ప్రమాదం జరగకుండా ఆపేశాడు

Updated On : January 7, 2020 / 7:18 AM IST

కెనడాలోని మాంట్రియల్ ట్రూడో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ కెనడా ఎక్స్ ప్రెస్ విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఓ టైర్ ఉండి పడిపోయిన సంఘటన చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన కొన్ని గంటల్లో వైరల్ గా మారింది. నేను ఒక టైర్ ఊడిపోయిన విమానంలో ఉన్నాను, 2020వ సంవత్సరం బాగా ప్రారంభమైంది అనే క్యాప్షన్ తో పోస్టు చేశాడు.

శుక్రవారం(జనవరి 4,2020) న కెనడా విమానాశ్రయం నుంచి 8684 విమానం 49 ప్రయాణికులతో బాగోట్విల్లేకు బయలు దేరింది. ఆ విమానం టేకాఫ్ సమయంలో ఎడమ వైపు టైర్ నుంచి మంటలు రావటం, టైరు ఊడి పోవటం గమనించిన పైలెట్ తెలివిగా విమానాన్ని క్రిందకి దింపాడు. ఆ సమయంలో ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు సురక్షితంగా ఉన్నారని తెలిపారు.