ఇరాన్‌ను ఈ సారి ఇంకా గట్టిగా కొడతాం: ట్రంప్

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి రెచ్చిపోయారు. ఇరాన్‌లోని మరో 52 సైట్లపై దాడి చేయనున్నట్లు తెలిపాడు. మరింత వేగంగా మునుపెన్నడూ లేనంతగా దాడి చేస్తామన్నాడు. అమెరికా ఆస్తులను నాశనం చేయాలని ఇస్లామిక్ రిపబ్లిక్ అటాక్ చేస్తే తాము ఊరుకునేది లేదని స్పష్టం చేశాడు.
ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో తన మార్-ఎ-లార్గో రీసార్ట్ లో ఆయన మాట్లాడుతూ.. ‘అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోడానికి సులేమాని కారకుడని, ఉగ్రవాదుల వసతి కల్పనలో సహకరించాడు ’ అని అన్నారు. సులేమానిని చంపేయాలంటూ తానే ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. #Soleimani క్రూరమైన కార్యకలాపాలతో ఎంతమంది అమాయికులు ప్రాణాలు కోల్పోయారని, బాధితుల గౌరవార్థంగా వారిని స్మరించుకుంటున్నట్టుగా తెలిపారు.
ఇండియాలో ఎక్కడెక్కడ ఉగ్రవాదుల ప్లాట్లు ఉన్నాయి అనేది ట్రంప్ క్లారిటీ ఇవ్వలేదు. తీవ్ర ప్రతీకార దాడి తప్పదని సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమనెయ్ హెచ్చరించారు. ఖాసీం సేవల్ని కొనియాడిన ఆయన.. మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. అమెరికా జరిపిన ఈ దాడిని అతి భయంకరమైన, ఉద్రిక్తతలను పెంచే అవివేకపు చర్యగా ఇరాన్ విదేశాంగ మంత్రి జావద్ ఝరీఫ్ అభివర్ణించారు.
అమెరికా చర్యకు ప్రతీకారం తప్పదంటూ ఇరాన్ గట్టి హెచ్చరికలే చేసింది.