Woman-Chimpanzee Friendshipe : మగ చింపాంజీతో మహిళ స్నేహం.. జూ కు రావద్దు అన్నఅధికారులు
జూలో ఉండే మగ చింపాంజీతో ఓ మహిళ స్నేహం చేస్తోంది. వీరి స్నేహంతో ఆ చింపాంజీ తోటి చింపాంజీలతో ఉండటం మానేసింది. దీంతో జూ అధికారులు ఆమెను జూకు రావద్దని చెప్పటంతో ఆమె కన్నీటితో..

Woman Banned From Visiting Chimpanzee
Woman Banned From Visiting Chimpanzee : జంతువుల్ని చూడాలంటే జూకు వెళతాం. అక్కడుండే పులులు, సింహాలు,కోతులు, చింపాంజీలను కూడా భలే ఉన్నాయే అని సంతోషపడిపోతాం.వాటిని ఎంతో అబ్బురంగా చూస్తాం. మళ్లీ తిరిగి వచ్చేస్తాం. ఎప్పుడన్నా వాటిని మళ్లీ చూడాలనుకుంటే మళ్లీ వెళతాం. కానీ ఏకంగా జూలో ఉండే జంతువులతో ప్రేమలో పడిపోం కదా..కానీ ఓ మహిళ మాత్రం జూలో జంతువుల్ని చూడటానికి వెళ్లి ఓ మగ చింపాంజీపై ఎంతో ప్రేమ పెంచుకుంది.పదే పదే దాన్ని చూడాలనిపించి జూకు వెళ్లేది. మిగతా ఏ జంతువుల వద్దకు వెళ్లేది కాదు. ఆ మగ చింపాంజీ దగ్గరే కూర్చుని తదేకంగా దాన్ని చూస్తుండిపోయేది.
అస్తమాను ఆమె కనిపిస్తుండటంతో ఆ చింపాంజీ కూడా ఆమెతో స్నేహం చేయటం మొదలుపెట్టింది. అలా ఆ మూగ జంతువు ఆమె స్నేహం కాస్తా బాగా బలపడిపోయింది. దీంతో ఆ మగ చింపాంజీ తోటి చింపాంజీలతో కలవటం మానేసింది. ఆ మహిళ కోసమే చూస్తుండేది. ఆమె వస్తే ఆమెతో పాటే ఉండిపోయేది. వీరి ప్రేమ ఎక్కడి వరకూ వెళ్లిందంటే తోటి చింపాంజీలు ఆ మగ చింపాంజీని పట్టించుకోవటమే మానేశారు. కానీ ఆ మగ చింపాంజీ కూడా తోటివాటితో ఉండటం మానేసి ఆ మహిళతోనే ఎన్నో మూగ ముచ్చట్లు చెప్పేది. వీరిద్దరి బంధాన్ని గుర్తించి జూ అధికారులు సదరు మహిళను జూకి రావద్దని తెగేసి చెప్పేశారు. జూలోకి ఎంట్రీ ఇవ్వటంలేదు. దీంతో జూలో ఆ మూగ జీవి..జూ బయట ఆమె కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి. ఈ వింత ఘటన బెల్జియంలో జరిగింది.
ఈ వింత ఘటన వివరాల్లో వెళ్తే.. బెల్జియంలోని ఆంట్వెర్ప్ జూకు 4 ఏళ్ల నుంచి ఏడీ టిమ్మర్‌మన్స్ అనే ఓ మహిళా వస్తున్నారు. క్రమం తప్పకుండా ప్రతీరోజు టిమ్మర్ జూకి వెళుతుండేవారు. జూకి వచ్చిన ఆమె వేరే ఏ జంతువుల వద్దకు వెళ్లేది కాదు. కేవలం 38 ఏళ్ల ఓ మగ చింపాంజీ వద్దే కూర్చుని దాన్నే చూస్తుండేది. అలా ప్రతీరోజు సంత్సరాల తరబడి ఆమె వస్తుండటంతో ఆ మగ చింపాంజీ కూడా ఆమెను గుర్తించడం మొదలుపెట్టింది.
అలా వారిద్దరి మధ్యా స్నేహం పెరిగింది. దీంతో చింపాంజీ దాని తోటి చింపాంజీలతో కలవటం మానేసింది. వాటితో కలిసి ఆడదు. వాటితో కలిసి ఆహారం తినదు. వాటికి దూరంగా ఉండిపోయేది. ఆమె వస్తే ఆమెతోనే లోకం అన్నట్లుగా ఉండేది. ఆమె వెళ్లిపోయాక ఒంటరిగా కూర్చునేది తప్ప మిగతా చింపాంజీలతో కలిసేది కాదు. దీంతో మిగతా చింపాంజీలు కూడా దాన్ని పట్టించుకోవటం మానేశాయి.
ఆ మగ చింపాంజీలో వచ్చిన మార్పును జూ సిబ్బంది గమనించారు. ఆ విషయాన్ని అధికారులకు చెప్పారు. దీంతో అధికారులు ఎన్ని రకాలు గా అది గతంలో లాగా ఉత్సాహంగా ఉండటానికి ఎన్ని విధాలుగా చేసినా అది అలాగే ఉండేది. దీనికి కారణం ఏమిటాని నిఘా పెట్టారు. అలా టిమ్మర్‌మన్స్ అనే మహిళేకారణమని గుర్తించారు. అయితే ఏడీ టిమ్మర్‌మన్స్ అనే మహిళ దాని వద్ద ఎక్కువ సమయం ఉండటం..వారిద్దరకి మధ్యా బంధం పెరగటం గుర్తించారు. ఇది మంచిది కాదని నిర్ణయించిన అధికారులు ఆమెను జూకు రావద్దని తెగేసి చెప్పారు.
దీంతో ఆమె అందరిని రానిస్తున్నారు నన్నెందుకు రానివ్వటంలేదని ప్రశ్నించారు. దానికి జూ అధికారులు ఇక్కడ ఉండే అన్ని జంతువులు ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉండేలా చేయటం మా బాద్యత అని..కానీ ఆ మగ చింపాంజీకి ఆమెకు మధ్య స్నేహం పెరగటం వల్ల చింపాజీకి మంచిది కాదనే అది తోటి చింపాంజీలతో కలిసి ఉత్సాహంగా ఉంటానికే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.