చిరుతకు సోషల్ స్కిల్స్ నేర్పించటానికి కుక్క ఫ్రెండ్ షిప్

  • Published By: veegamteam ,Published On : February 10, 2020 / 07:31 AM IST
చిరుతకు సోషల్ స్కిల్స్ నేర్పించటానికి కుక్క ఫ్రెండ్ షిప్

Updated On : February 10, 2020 / 7:31 AM IST

అమెరికాలోని న్యూజెర్సీలోని జూలో ఓ కుక్క పిల్ల చిరుతపులి పిల్ల కలిసి..మెలిసి జీవిస్తున్నాయి. ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. “బౌవీ” లాబ్రడార్ రిట్రీవర్ అనే కుక్కపిల్ల  “నంది” చిరుత పిల్లలు రెండూ కొన్ని వారాల వయస్సు నుండి కలిసి కలిసి పెరుగుతున్నాయి. రెండూ తమ జాతివైరం మరచి చక్కగా కలిసిమెలిసి  ఆడుకుంటున్నాయి. ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేయడమే కాకుండా ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

యుఎస్ జంతుప్రదర్శనశాలలలో చిరుతలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు సిగ్గుపడుతుంటాయని..పెద్దగా బైటకు రావు..వేరే జంతువులతో కూడా కలవవు. దీంతో వాటిలో ఆత్మ విశ్వాసం పెంచడానికి చిన్న చిరుతలను కుక్కలతో కలిపి పెంచుతూంటారు. కానీ అడవిలో ఉండే చిరుతపిల్లలు మాత్రం పెరిగి పెద్దైన తరువాత తమ ఆకలి తీర్చుకోవటానికి జంతువులను అత్యంత చాకచక్యంగా వేటాడతాయి. ఇలా వేటాడటంతో ఏమాత్రం కనికరం చూపించవు. దీంతో చిరుతలలో అస్సలు జాలి గుణం ఉండదు. 

జూలో పెంచే చిరుతలు వేటాడితే అక్కడ ఉండే సాధు జంతువులన్నింటినీ గుంటకాయస్వాహా చేసేస్తాయి. ఈ క్రమంలో చిరుతల్లో సాటి జంతువులను వేటాడే గుణం తగ్గించటానికి జూ అధికారులు చిరుత పిల్లలతో కుక్కపిల్లలను కలిపి పెంచుతుంటారు. యూఎస్ లోని పలు జూలలో అధికారులు చిరుత పిల్లల విషయంలో ఇలాగే చేస్తుంటారు. చిరుతకు వేటాడే గుణం తగ్గి అవి కూల్ గా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. 

చిరుత..కుక్కల మధ్యా స్నేహం..బలమైన బంధాన్ని పెంచుతుందని జూ అధికారులు భావిస్తున్నారు. అలా జరగాలని ఆశిస్తున్నారు. ప్రస్తుతం దీనికి..సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవ్వడమే కాకుండా ఆ రెండు పిల్లలను కనే అవకాశం ఉందా? అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.మరికొంతమంది వెరీ గుడ్ ఇది మంచి ప్రయత్నం అనీ..చూడటానికి అవి చాలా ముద్దుగా ఉన్నాయని భవిష్యత్తులో చిరుత తన సహజ ధోరణితో కుక్కను చంపితే ఏంటీ పరిస్థితి…? అని ప్రశ్నిస్తున్నారు.