IPL 2021 SRH Vs RCB : ఉత్కంఠ పోరులో హైదరాబాద్ పై బెంగళూరు సూపర్ విక్టరీ

Ipl 2021 Srh Vs Rcb Beat
IPL 2021 SRH Vs RCB : ఐపీఎల్ 2021 సీజన్ 14లో భాగంగా హైదరాబాద్ తో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ లో బెంగళూరు సూపర్ విక్టరీ కొట్టింది. బెంగళూరు బౌలర్ల ధాటికి వార్నర్ సేన చిత్తు అయ్యింది. స్వల్ప టార్గెట్ ను కూడా హైదరాబాద్ చేజ్ చెయ్యలేకపోయింది. విజయానికి 6 పరుగుల దూరంలో హైదరాబాద్ నిలిచిపోయింది. 9 వికెట్లకు 143 పరుగులే చేయగలిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌లో మరోసారి బౌలర్లు రాణించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కోహ్లీసేన నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ (59: 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. టాస్ గెలిచిన వార్నర్ సేన బెంగళూరును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. జట్టు స్కోరు 19 పరుగుల దగ్గర పడిక్కల్ (11)ను భువనేశ్వర్ ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షాబాజ్, కోహ్లీ కలిసి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. 14 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర షాబాజ్‌ను నదీమ్ పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాత భారం మొత్తం మ్యాక్స్‌వెల్, కెప్టెన్ కోహ్లీపై పడింది.
కాసేపటికే 91 పరుగుల దగ్గర కోహ్లీ (33)ని జేసన్ హోల్డర్ ఔట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన డివిలియర్స్ (1) ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. వాషింగ్టన్ సుందర్ (8), క్రిస్టియన్(1), జెమీసన్ (12) ఎక్కువ పరుగులు చేయలేకపోయారు. ఆఖర్లో మ్యాక్స్‌వెల్ మెరిపించడంతో బెంగళూరు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. హైదరాబాద్ బౌలర్లలో హోల్డర్ మూడు, రషీద్‌ఖాన్ రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్, నదీమ్, నటరాజన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
హైదరాబాద్ జట్టులో కెప్టెన్ వార్నర్ ఒక్కడే రాణించాడు. 29 బంతుల్లో 47 పరుగులు చేశాడు. మనీష్ పాండే పర్లేదనిపించాడు. 38 బంతుల్లో 38 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్ మెన్ విఫలం అయ్యారు. బెంగళూరు బౌలర్లలో షాబాజ్ అహ్మద్ 3 వికెట్లు తీశాడు. హర్షల్ పటేల్ 2, సిరాజ్ 2 వికెట్లు తీశారు. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి జట్టుకి విజయాన్ని అందించారు.
స్కోర్లు:
బెంగళూరు-149/8
హైదరాబాద్-143/9