JP Nadda in Kolkata: తెలంగాణ, ఏపీలోనూ బీజేపీ ప్రభుత్వం రానుంది: నడ్డా
దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు కుటుంబాల చేతుల్లో ఉన్నాయని నడ్డా అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటోన్న బీజేపీ పశ్చిమ బెంగాల్‌లో సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కోల్‌కతాలో నిర్వహించిన ఓ సమావేశంలో నేడు జేపీ నడ్డా పాల్గొని మాట్లాడారు.

Jp Nadda
JP Nadda in Kolkata: దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు కుటుంబాల చేతుల్లో ఉన్నాయని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటోన్న బీజేపీ పశ్చిమ బెంగాల్‌లో తమ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కోల్‌కతాలో నిర్వహించిన ఓ సమావేశంలో నేడు జేపీ నడ్డా పాల్గొని మాట్లాడారు.
bihar: బిహార్‌లో ఎంఐఎంకు షాక్.. ఆర్డేడీలో చేరనున్న నలుగురు ఎమ్మెల్యేలు?
”ములాయం సింగ్ యాదవ్ (ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం) పాలన అంతమవుతుందని అప్పట్లో ఎవ్వరూ ఊహించలేదు. అలాగే, కాంగ్రెస్ పాలన నుంచి మనం విముక్తి పొందుతామని కూడా ఎవ్వరూ అనుకోలేదు. ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ కనపడకుండాపోయే పరిస్థితులు ఉన్నాయి. బీజేపీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఆదర్శాలు, విధానాలు లేవు. టీఎంసీ అనేది అత్త-మేనల్లుడి కుటుంబ పార్టీ. వచ్చే ఎన్నికల్లో టీఎంసీని ఓడిస్తాం. భవిష్యత్తు అంతా బీజేపీదే. గతంలో దేశంలో కాంగ్రెస్‌ను ఎలా ఓడించామో, అలాగే ఇప్పుడు రాష్ట్రంలో టీఎంసీని ఓడిస్తాం. కాంగ్రెస్ పార్టీ ఓ సంస్థగా మారింది. దాన్ని ఓ అన్న-చెల్లి నడిపిస్తున్నారు” అని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు.