ఏపీలో 2వేలు దాటిన కరోనా కేసులు, కొత్తగా 38 మందికి కొవిడ్
ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా కేసుల సంఖ్య 2వేలు దాటింది. రాష్ట్రంలో కొత్తగా

ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా కేసుల సంఖ్య 2వేలు దాటింది. రాష్ట్రంలో కొత్తగా
ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా కేసుల సంఖ్య 2వేలు దాటింది. రాష్ట్రంలో కొత్తగా 38మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2018కి చేరింది. కరోనా కేసులు గురించి సోమవారం(మే 11,2020) వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా నుంచి 998మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45మంది మరణించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 975. కరోనాతో 45మంది చనిపోయారు.
తాజాగా నమోదైన 38 కేసుల్లో..
* కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో కొత్తగా 9 చొప్పున కేసులు
* అనంతపురం జిల్లాలో 8 కేసులు
* గుంటూరు జిల్లాలో 5 కేసులు
* కృష్ణా, విశాఖ జిల్లాల్లో 3 చొప్పున కేసులు
* నెల్లూరు జిల్లాలో ఒక కేసు
* గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 73మంది డిశ్చార్జి
జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు:
కర్నూలు – 575
గుంటూరు – 387
కృష్ణా – 342
చిత్తూరు – 121
అనంతపురం – 115
నెల్లూరు – 102
కడప – 97
ప.గో – 68
విశాఖ – 66
ప్రకాశం – 63
తూ.గో – 46
శ్రీకాకుళం – 5
విజయనగరం – 4
ఇతర రాష్ట్రాలకు చెందిన 27మందికి కరోనా
Read More :
* ఏపీలో కొవిడ్ సూపర్ స్ప్రెడర్స్.. ఆ 40 మంది 300 మందికి కరోనా అంటించారు