ఏం వయ్యారమే తల్లీ..రోడ్డుపై ఆవు క్యాట్ వాక్..ఫ్యాషన్ షోకు వెళుతున్నావా ఏంటీ?!

cow cat walk : క్యాట్ వాక్..అంటే పిల్లి నడకలు. పిల్లులు ఎలా నడుస్తారో అచ్చం అలాగే నడుస్తారు మోడల్స్. ర్యాంపుల మీద వయ్యారాలు ఒలికిస్తూ నడుస్తుంటారు మోడల్స్. పిల్లి నడకల్ని క్యాట్ వాక్ అంటాం. కానీ హంసల నడకల్ని స్వాన్ వాక్ అని అనం కానీ ఓ ఆవు మాత్రం రోడ్డుమీద ఎంత వయ్యారంగా క్యాట్ వాక్ చేస్తుండటం చూసిన నెటిజన్లు ‘ అయ్యో ఏమి వయ్యారమే తల్లీ నీకు..ఫ్యాషన్ షోలకు వెళుతున్నావా? ఏంటీ అంటూ ఫన్నీ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇది క్యాట్ వాక్ కాదు కౌ వాక్ అంటున్నారు. కౌ వాక్. అంటే ఆవు నడక. ఆవు క్యాట్ వాక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసినవారంతా పడి పడి నవ్వుతున్నారు. ఈ ఆవు మీద సోషల్ మీడియాలో జోక్స్ కూడా పేలుతున్నాయి. ఇది ఎక్కడ జరిగింది? ఆ ఆవు ఎవరిది? అనే డౌట్స్ మానేసి చక్కగా ఈ ఆవుగారి క్యాట్ వాక్ హొయలు చూడండీ..