vice-presidential candidate: ధన్‌కర్‌కు ఉన్న జ్ఞానం దేశానికి ఉపయోగపడుతుంది: అమిత్ షా
భారత ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థిగా ప్రస్తుత పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్ పోటీ చేస్తారని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇవాళ కేంద్ర మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత అమిత్ షాను జగదీప్ ధన్‌కర్ కలిశారు. ధన్‌కర్‌కు అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు.

Amit Shah To Visit Telangana Praja Sangrama Yatra Public Meeting
vice-presidential candidate: భారత ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థిగా ప్రస్తుత పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్ పోటీ చేస్తారని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇవాళ కేంద్ర మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత అమిత్ షాను జగదీప్ ధన్‌కర్ కలిశారు. ధన్‌కర్‌కు అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు.
IndiGo: హైదరాబాద్ రావాల్సిన ఇండిగో విమానం.. పాకిస్తాన్‍లో ల్యాండింగ్
”ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థిగా నిలుస్తున్న శ్రీ ధన్‌కర్ జీకి శుభాకాంక్షలు. సామాన్య రైతు కుటుంబంలో ఆయన జన్మించారు. ప్రజా సంక్షేమం, సమాజ శ్రేయస్సు కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశారు. ఆయనకు దేశ ప్రజల సమస్యలు తెలుసు.. అలాగే ఆయనకు రాజ్యాంగపర జ్ఞానం బాగా ఉంది. ఈ అంశాలు దేశ ప్రయోజనాలకు ఉపయోగపడతాయి” అని అమిత్ షా ట్వీట్ చేశారు. కాగా, ధన్‌కర్‌పై ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతలు ప్రశంసలు కురిపించారు. ధన్‌కర్ రైతు బిడ్డ అని, చాలా కాలంగా సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారని మోదీ అన్నారు.