Hari Hara Veera Mallu: క్లైమాక్స్‌కు చేరుకున్న వీరమల్లు.. చెలరేగనున్న పవన్..?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా బుధవారం నుంచి ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సీన్స్‌ను చిత్రీకరించేందుకు క్రిష్ అండ్ టీమ్ రెడీ అవుతోంది.
Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ పీరియాడికల్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో క్రియేట్ అయ్యాయి.
Hari Hara Veera Mallu: పవన్ లేకుండానే ‘హరిహర వీరమల్లు’ యుద్ధం చేస్తున్నాడా..?
ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్ గ్లింప్స్ ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన వార్ ఎపిసోడ్స్‌ను రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్లో చిత్రీకరిస్తున్నారు. అయితే తాజాగా బుధవారం నుంచి ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సీన్స్‌ను చిత్రీకరించేందుకు క్రిష్ అండ్ టీమ్ రెడీ అవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన వర్క్‌షాప్ కూడా నిర్వహించాడట దర్శకుడు.
Hari Hara Veera Mallu: పవన్ సినిమాలో విలన్ మారిపోయాడు.. కారణం అదేనా?
ఈ క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరణలో పవన్ కల్యాణ్‌తో పాటు చాలా మంది నటీనటులు పాల్గొంటారట. ఈ సినిమాలో హీరోయిన్గా అందాల భామ నిధి అగర్వాల్ నటిస్తోండగా ఎంఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను ఏఎం.రత్నం అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు.