Family Planning Operation : ఇబ్బహీంపట్నం కు.ని. ఆపరేషన్ల ఘటనలో DMHO స్వరాజ్యలక్ష్మికి ప్రమోషన్‌

ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మృతి చెందారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం బాధ్యులపై చర్యలు చేపట్టింది. దీంట్లో భాగంగా రంగారెడ్డి DMHO స్వరాజ్యలక్ష్మిపై బదిలీవేటు వేశారు అంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం కాదని స్వరాజ్యలక్ష్మికి ప్రమోషన్ తో కూడిన బదిలి కావటం విశేషం.

Family Planning Operation : ఇబ్బహీంపట్నం కు.ని. ఆపరేషన్ల ఘటనలో DMHO స్వరాజ్యలక్ష్మికి ప్రమోషన్‌

Ibrahimpatnam Family Planning Operation

Updated On : September 24, 2022 / 12:25 PM IST

Ibbahimapatnam Family Planning Operation : ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మృతి చెందారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం బాధ్యులపై చర్యలు చేపట్టింది. దీంట్లో భాగంగా రంగారెడ్డి DMHO స్వరాజ్యలక్ష్మిపై బదిలీవేటు వేశారు అనే వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తల్లో వాస్తవం కాదని స్వరాజ్యలక్ష్మికి బదిలీ జరిగిన మాట వాస్తవమే గానీ ఆ బదిలీ ప్రమోషన్ తో కూడినది కావటం విశేషం. స్వరాజ్యలక్ష్మికి ప్రమోషన్ ఇస్తూ కమిషనర్ ఆఫీసుకు తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసిందని స్పష్టమైంది.

ఈకేసులో ప్రభుత్వం మొత్తం 13మందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. దీంట్లో భాగంగా కుటుంబనియంత్రణ ఆపరేషన్లు చేసిన డాక్టర్ జోయల్ సునీల్ పై క్రిమినల్ కేసు నమోదు చేసింది.ఆపరేషన్లు వికటించి మహిళలు చనిపోయిన ఘటనలో బాధ్యులపై చర్యలతో పాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మార్గదర్శకాలు జారీ చేసింది.

Ibrahimpatnam Family Planning Operation : ఇబ్బహీంపట్నం కు.ని. ఆపరేషన్ల ఘటన .. DMHO స్వరాజ్యలక్ష్మి బదిలీ .. డాక్టర్‌పై క్రిమినల్ కేసు నమోదు

ఆగస్టు 25న ఇబ్రహీంపట్నంలో ప్రభుత్వ ఆస్పత్రిలో 34 మంది మహిళలకు కుటుంబనియంత్రణ ఆపరేషన్‌లు చేయగా.. ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మృతి చెందారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ కోసం ఓ కమిటీని నియమించింది. విచారణ చేపట్టిన కమిటీ నివేదికను రూపొందించి ప్రభుత్వనికి సమర్పించగా కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంది ప్రభుత్వం.