Monkeypox: భారత్‌లో తొలి మంకీపాక్స్ కేసు నమోదు
ఇప్పటికే పలు దేశాల్లో వ్యాప్తి చెంది కలకలం రేపిన మంకీపాక్స్ భారత్‌కూ విస్తరించింది. భారత్‌లో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. యూఏఈ నుంచి కేరళకు వచ్చిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఇవాళ ప్రకటించారు. ఆ వ్యక్తి ఈ నెల 12న తిరువనంతపురం విమానాశ్రయంలో దిగాడని చెప్పారు.

Monkeypox
Monkeypox: ఇప్పటికే పలు దేశాల్లో వ్యాప్తి చెంది కలకలం రేపిన మంకీపాక్స్ భారత్‌కూ విస్తరించింది. భారత్‌లో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. యూఏఈ నుంచి కేరళకు వచ్చిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఇవాళ ప్రకటించారు. ఆ వ్యక్తి ఈ నెల 12న తిరువనంతపురం విమానాశ్రయంలో దిగాడని చెప్పారు. అతడిలో మంకీపాక్స్ లక్షణాలు కనపడడంతో ఆసుపత్రిలో చేర్పించామని తెలిపారు. అతడి శాంపిళ్ళను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించగా పాజిటివ్‌గా తేలిందన్నారు.
Maharashtra: పెట్రోల్‌పై లీటరుకు రూ.5 వ్యాట్ తగ్గించిన మహారాష్ట్ర కొత్త సీఎం షిండే
అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. దీని గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. మంకీపాక్స్ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని చెప్పారు. ఇటీవల అతడు కలిసిన వారిని అందరినీ గుర్తించామని వివరించారు. అతడి తల్లిదండ్రులు, ఓ ట్యాక్సీ డ్రైవర్, ఓ ఆటో డ్రైవర్‌తో పాటు విమానంలో అతడితో ప్రయాణించిన 11 మందిని గుర్తించామని చెప్పారు. కాగా, మంకీపాక్స్ విస్తరించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఉదయమే రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. కేంద్ర ప్రభుత్వం మేలో మంకీపాక్స్‌కు సంబంధించి ఐసోలేషన్, కాంట్రాక్ట్-ట్రేసింగ్‌కు మార్గదర్శకాలు విడుదల చేసింది.
Sri Lanka: ఎట్టకేలకు అధ్యక్ష పదవికి గొటబాయ రాజపక్స రాజీనామా.. శ్రీలంకలో సంబరాలు
కాగా, ఇప్పటికే మంకీపాక్స్ 50కి పైగాదేశాలకు విస్తరించింది. వాటిల్లో 86 శాతం ఐరోపాలోనే ఉన్నాయి. మంకీపాక్స్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కూడా పలుసార్లు సూచనలు చేసింది. దీంతో భారత్‌లోని విమానాశ్రయాల్లో సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఐసోలేషన్‌కు తరలించి, శాంపిళ్ళను పరీక్ష కోసం పంపుతున్నారు.