Super Star Krishna: విషమంగా సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం.. వెంటిలేటర్‌పై ఐసీయూలో చికిత్స..

సూపర్ స్టార్ కృష్ణ ఈరోజు ఉదయం రెండు గంటలకు కార్డియాక్ అరెస్ట్‌తో హైదరాబాద్‌లోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. 20 నిముషాలు పాటు సీపీఆర్ చేసినట్లు తెలిపిన డాక్టర్లు.. ప్రస్తుతం అయన ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉందంటున్నారు. ప్రస్తుతం కృష్ణను ఐసీయూకి తరలించి వెంటిలేటర్ పై చికిత్సను అందిస్తున్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, క్రిటికల్ కేర్ స్పెషలిస్టుల అబ్జర్వేషన్‌లో కృష్ణను ఉంచారు.

Super Star Krishna: విషమంగా సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం.. వెంటిలేటర్‌పై ఐసీయూలో చికిత్స..

Updated On : November 14, 2022 / 10:59 PM IST

Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు కార్డియాక్ అరెస్ట్‌తో హైదరాబాద్‌లోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. 20 నిమిషాల పాటు సీపీఆర్ చేసినట్లు తెలిపిన డాక్టర్లు.. ప్రస్తుతం అయన ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉందంటున్నారు. ప్రస్తుతం కృష్ణను ఐసీయూకి తరలించి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, క్రిటికల్ కేర్ స్పెషలిస్టులు కృష్ణను అబ్జర్వేషన్‌లో ఉంచారు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 14 Nov 2022 06:32 PM (IST)

    మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్.. డయాలిసిస్ జరుగోతంది.. ఇప్పుడే ఏం చెప్పలేం : డా గురు ఎన్ రెడ్డి

    సూపర్ స్టార్ కృష్ణగారి ఆరోగ్య పరిస్థితిపై తాజాగా కాంటినెంటల్ హాస్పిటల్ చైర్మన్ డా. గురు ఎన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘కృష్ణగారి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉంది. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్సను అందిస్తున్నాం. ఉదయం నుంచి 8 మంది డాక్టర్లు కృష్ణగారికి చికిత్సను అందిస్తున్నారు. లివర్, కిడ్నీ, లంగ్స్‌పై ప్రభావం పడింది. మరో 24 గంటలు అబ్జర్వేషన్‌లోనే ఉండాలి. కృష్ణగారికి డయాలిసిస్ జరుగుతోంది. మిగతా అవయాల పనితీరు మందగించింది. ప్రస్తుతానికి బ్రెయిన్ డెడ్ అవలేదు కానీ, బ్లీడింగ్ అవుతోంది. ఇప్పుడే ఏమీ చెప్పలేం. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మరిన్ని వివరాలను రేపు మధ్యాహ్నం బులెటిన్‌లో తెలియజేస్తాం’’ అని అన్నారు.

  • 14 Nov 2022 06:16 PM (IST)

    క్రిటికల్‌గానే ఉన్నా.. స్టేబుల్‌గానే ఉన్నారు : నరేశ్

    కృష్ణ ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన కుమారుడు, నటుడు నరేశ్ తాజాగా మీడియాతో మాట్లాడారు. కృష్ణగారి పరిస్థితి క్రిటికల్‌గానే ఉన్నా.. స్టేబుల్‌గానే ఉన్నారని.. ఉదయం నుంచి ఒకే రకమైన చికిత్సను అందిస్తున్నారని.. ఆయన శ్వాస తీసుకుంటున్నారని.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం డాక్టర్లే చెబుతారని నరేశ్ తెలిపారు. కృష్ణగారు ఫైటర్.. ఈ పరిస్థితి నుంచి ఆయన ఖచ్చితంగా బయటకు వస్తారని నరేశ్ అన్నారు.

  • 14 Nov 2022 06:10 PM (IST)

    మరికాసేపట్లో కాంటినెంటల్ హాస్పిటల్ చైర్మన్ డా. గురు ఎన్ రెడ్డి ప్రెస్‌మీట్

    సూపర్ స్టార్ కృష్ణ పరిస్థితి ఇంకా క్లిష్టంగానే ఉందని ఇప్పటికే హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు. ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్‌పై స్పెషలిస్ట్ వైద్యుల బృందం ట్రీట్మెంట్ అందించేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ట్రీట్మెంట్‌కు కృష్ణ బాడీ రెస్పాండ్ కావడం లేదని డాకర్లు తెలుపుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ట్రీట్మెంట్ ఆపొద్దని మహేశ్ బాబు కోరారు. కాగా, కృష్ణ తాజా ఆరోగ్య పరిస్థితిపై కాంటినెంటల్ హాస్పిటల్ చైర్మన్ డా. గురు ఎన్ రెడ్డి మరికాసేపట్లో మీడియాకు వివరించనున్నారు.

  • 14 Nov 2022 05:31 PM (IST)

    కాంటినెంటల్ హాస్పిటల్‌కు చేరుకుంటున్న సినీ ప్రముఖులు

    కార్డియాక్ అరెస్ట్‌తో కాంటినెంటల్ హాస్పిటల్‌లో సూపర్ స్టార్ కృష్ణ అడ్మిట్ అయ్యారనే వార్త ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆందోళనకర పరిస్థితిని క్రియేట్ చేసింది. ఇప్పటికే కృష్ణ ఆరోగ్యం చాలా క్లిష్టంగా ఉందని డాక్టర్లు తెలియజేయడంతో, కృష్ణ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా ఆసుపత్రికి చేరుకుంటున్నారు. అటు సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు కూడా కృష్ణ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు ఆసుపత్రికి తరలివెళ్తున్నారు.

  • 14 Nov 2022 04:16 PM (IST)

    రాత్రి నుంచి హాస్పిటల్‌లోనే కృష్ణ కుటుంబ సభ్యులు

    సూపర్ స్టార్ కృష్ణ ఇవాళ ఉదయం 2 గంటలకు కార్డియాక్ అరెస్ట్ తో కాంటినెంటల్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. ఆయనకు వెంటనే సీపీఆర్ అందించి, ఐసీయూకి షిఫ్ట్ చేసినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పై ఉన్నట్లుగా డాక్టర్లు తెలిపారు. అయితే 48 గంటల సమయం గడిస్తే కానీ, తామేమి చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు. కాగా, రాత్రి నుంచి మహేశ్ బాబు సహా కృష్ణ కుటుంబ సభ్యులు హాస్పిటల్‌లోనే ఉన్నట్లుగా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

  • 14 Nov 2022 02:39 PM (IST)

    ఎక్స్‌క్లూజివ్: కృష్ణ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల

    సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యంపై కాంటినెంటల్ హాస్టిటల్ డాక్టర్లు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. ఇవాళ తెల్లవారుజామున 01.15 గంటలకు ఆయనకు గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తీసుకొచ్చారని.. వెంటనే ఆయనకు సీపీఆర్ చికిత్సను అందించి, 20 నిమిషాల్లో ఐసీయూలోకి మార్చినట్లుగా తెలిపారు. ప్రస్తుతం ఆయనకు మెరుగైన చికిత్సను అందిస్తూ వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని.. ఆయన పరిస్థితి క్లిష్టంగానే ఉందని వారు తెలిపారు. అనుభవజ్ఞులైన కార్డియాలజిస్టులు, న్యూరాలజిస్టులు, క్రిటికల్ కేర్ స్పెషలిస్టులు కృష్ణ ఆరోగ్య పరిస్థితిని ప్రతిక్షణం పర్యవేక్షిస్తున్నట్లుగా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

    Krishna Health Bulletin

    Krishna Health Bulletin

  • 14 Nov 2022 02:09 PM (IST)

    కృష్ణ ఆరోగ్యంపై మీడియాతో మాట్లాడిన డాక్టర్లు

    సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యంపై డాక్టర్లు మీడియాతో మాట్లాడారు. ఆయన ఆరోగ్యం క్లిష్టంగా ఉందని.. ప్రతి గంటా కీలకమే అని తెలిపారు. మరో 48 గంటల వరకు ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు.

  • 14 Nov 2022 02:03 PM (IST)

    మీడియాతో మాట్లాడిన డాక్టర్లు..

     

    కృష్ణకి ప్రస్తుతం అవసరమైన వైద్యాన్ని అందిస్తున్నామని కాంటినెంటల్ హాస్పిటల్ డాక్టర్లు తెలిపారు..