Ram Charan: ఆచార్యను ఏమాత్రం పట్టించుకోని చరణ్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం RRR చిత్ర ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా వస్తుండటంతో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌ను.....

Ram Charan Not Saying A Word About Acharya Movie
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం RRR చిత్ర ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా వస్తుండటంతో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌ను అదే స్థాయిలో నిర్వహిస్తోంది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను ఈ ప్రమోషన్స్‌లో పంచుకుంటూ ఇద్దరు హీరోలు కూడా సందడి చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ మాత్రం కొంతమేర నిరాశకు లోనవుతున్నట్లు తెలుస్తోంది. RRR ప్రమోషన్స్ వేదికను ఉపయోగించుకుని తన తండ్రి చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రానికి సంబంధించి చరణ్ ఏదైనా మాట్లాడితే బాగుంటుందని వారు ఆశిస్తున్నారు.
RRR Promotions: దర్శక దిగ్గజం జక్కన్న.. ఓ ఆట ఆడేసుకున్న హీరోలు!
కానీ RRR ప్రమోషన్స్‌లో కేవలం ఈ సినిమాకు సంబంధించే అందరూ మాట్లాడుతుండటంతో చరణ్ ఆచార్య గురించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోకు తక్కువ కేమియో పాత్రకు ఎక్కువగా చరణ్ పాత్ర ఉండబోతుందని చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఈ సినిమాను గతేడాదే రిలీజ్ చేయాలని అనుకున్నా కరోనా కారణంగా వాయిదా వేస్తూ వచ్చారు. ఇక ఇప్పటివరకు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో పెద్దగా బజ్ లేకపోవడంతో మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. వరుసగా బడా సినిమాలు లైన్ కట్టడం, ఆచార్య గురించి జనాలు పట్టించుకోకపోవడంతో ఈ సినిమాపై వెంటనే అంచనాలు క్రియేట్ చేయాలని వారు కోరుతున్నారు.
అందుకే పాన్ ఇండియా స్థాయిలో RRR ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న చరణ్ ఆచార్య చిత్రం గురించో, ఆ సినిమాలో తన పాత్ర గురించో, లేక తన తండ్రి చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఎక్స్‌పీరియన్స్.. ఇలా ఏదో ఒక అంశంపై మాట్లాడితే.. ఆచార్య చిత్రానికి కూడా ప్రేక్షకుల్లో గుర్తింపు వచ్చి సినిమాకు ఆదరణ పెరిగే అవకాశం ఉందని వారు అంటున్నారు. ఇక స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య చిత్రంలో మెగాస్టార్ సరికొత్త లుక్‌లో మనకు కనిపిస్తున్నాడు. ఈ సినిమాను కొరటాల మార్క్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కించగా, చిరు స్టామినాకు ఏమాత్రం తగ్గకుండా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
Acharya: హిందీలోకి ఆచార్య.. చెర్రీ పాపులారిటీ క్యాష్ చేసుకునేందుకేనా?
ఇక ఈ సినిమాలో సిద్ధ అనే పాత్రలో చరణ్ నటిస్తున్నాడు. ఆయన పాత్ర ఈ సినిమాకే హైలైట్‌గా నిలవబోతుందని, మెగా ఫ్యాన్స్ ఈ పాత్రను ఎప్పటికీ గుర్తించుకునే విధంగా చిత్ర యూనిట్ తీర్చిదిద్దినట్లు చెబుతోంది. ఈ సినిమాలో చరణ్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తుండగా, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.