RRR: ఓటీటీలో ముందుగానే వస్తోన్న ఆర్ఆర్ఆర్..?
టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా గత మూడేళ్లుగా ప్రేక్షకులను ఊరిస్తూ వచ్చిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్నో వాయిదాల తరువాత ఎట్టకేలకు మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ....

Rrr To Stream Earlier Than Expected In Ott
RRR: టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా గత మూడేళ్లుగా ప్రేక్షకులను ఊరిస్తూ వచ్చిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్నో వాయిదాల తరువాత ఎట్టకేలకు మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో ఇద్దరు మేటి స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ఇక తొలిరోజే ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో, బాక్సాఫీస్ వద్ద కళ్లుచెదిరే కలెక్షన్లు రాబడుతోంది ఈ చిత్రం.
RRR : ‘ఆర్ఆర్ఆర్’కి పైరసి దెబ్బ.. ఆ సైట్‌లో అప్పుడే సినిమా
ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.500 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు సాధించి ఆల్‌టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమాను తనదైన మార్క్‌తో తెరకెక్కించగా, పీరియాడిక్ కథకు ఫిక్షన్‌ను జోడించి ఈ సినిమాను తీర్చిదిద్దారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డేట్ కూడా త్వరలోనే రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తొలుత ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు 90 రోజుల సమయం పడుతుందని అందరూ అనుకున్నారు.
RRR Collections : మూడు రోజుల్లో 500 కోట్లు.. అదిరిపోయిన ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్స్
కానీ, ఈ సినిమాను ఓటీటీలో అనుకున్న దానికంటే ముందుగానే స్ట్రీమింగ్ చేసేందుకు జీ5 రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఏప్రిల్ నెలలో పలు చిత్రాలు రిలీజ్ కానుండటంతో, ఆర్ఆర్ఆర్‌కు సినిమా థియేటర్లు తగ్గి ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ కూడా క్రమంగా తగ్గుతుందని పలువురు భావిస్తున్నారు. ఇదే సమయంలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఏప్రిల్ నెలాఖరున ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తే అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతుందని సదరు ఓటీటీ నిర్వాహకులు ఆలోచిస్తున్నారట. దీంతో ఆర్ఆర్ఆర్ చిత్రం ఓటీటీలో అనుకున్న దానికంటే ముందుగానే కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సినీ క్రిటిక్స్ అంటున్నారు. మరి నిజంగానే ఆర్ఆర్ఆర్ లాంటి మూవీని రిలీజ్ అయిన నెలలోపే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.