ఒకప్పుడు ఆటో డ్రైవర్..ఇప్పుడు 2500ల రకాల ఇడ్లీలు చేసి గిన్నీ రికార్డ్ సాధించిన ఘనుడు

Tamil Nadu Man 2547 varieties of idlis Made Guinness Record : ఇడ్లీతో అద్భుతాలు చేయొచ్చని నిరూపించారు తమిళనాడులోని చెన్నైకు చెందిన ఎమ్.ఎనియావన్ అనే 49ఏళ్ల వ్యక్తి. 10 కాదు 20 కాదు ఏకంగా 2,500ల రకాలు ఇడ్లీలు తయారు చేసి గిన్నిస్ రికార్డు సాధించారు ఎనియావన్.
ఎవరీ ఎనియావన్ అంటే ఒకప్పుడు ఆటో డ్రైవర్ గా తన జీవితాన్ని సాగించిన వ్యక్తి. భారతీయుల అత్యంత ఫేమస్ అయిన ఇడ్లీలతో రికార్డు సాధించారు. చెన్నై వెళ్లి ఎమ్. ఎనియావన్ ఎవరు అంటే చాలా మంది గుర్తు పట్టరు. కానీ, ఇడ్లీ మ్యాన్ అని చెబితే చాలు. టక్కున అతని దగ్గరకు తీసుకువెళ్లతారు. ఆయన చేతి ఇడ్లీలను రుచి చూపిస్తారు?. ఒకప్పుడు ఆటో డ్రైవర్ అయిన ఈ 49 ఏళ్ల వ్యక్తి ఇడ్లీ మ్యాన్‌గా మారి బాగా పాపులర్ అయ్యారు.
ఇడ్లీ అంటే తెల్లగా పువ్వులాగా ఉండే ఇడ్లీలనే మనకు తెలుసు. అంతగా కాకుంటే క్యారెట్ ఇడ్లీ, బీట్ రూట్ ఇడ్లీ, పాలక్ ఇడ్లీలు తెలుసు. కానీ ఆకుపచ్చ, నీలం, ఆరెంజ్, రంగులతో పాటు పలు రకాల రంగుల్లో ఇడ్లీలో చేయటంలో ఎనియావన్ స్పెషలిస్ట్.
ఈయన చేసే ఇడ్లీలో కేవలం గుండ్రంగా మాత్రమే కాదు..లవ్ సింబల్స్, సీతాకోకచిలుక, చేపలు వంటి పలు రకాల షేపుల్లో ఉంటాయి. ఇవన్నీ ఇడ్లీలే అంటే నమ్మలేం. కానీ ఒక్కసారి రుచి చూస్తే మాత్రం..కచ్చితనం వన్ మోర్ ప్లేజ్ ప్లీజ్ అంటాం. అంత టేస్ట్ గా ఉంటాయి ఎనియావన్ తయారు చేసే ఇడ్లీలు.
ఇలా ఏకంగా 2,500లకుపైగా అంటే 2,547 రకాల ఇడ్లీలు చేసి గిన్నీస్ రికార్డు సాధించారు ఎనియావన్. ఈయన చేసే ఇడ్లీలకు ఒక్కో ఇడ్లీలకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఒక్కో రకమైన టేస్ట్ ఉంటుంది. ఆ వెరైటీ టేస్టులతో కష్టమర్లను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఆయన రెస్టారెంట్ ఎప్పుడు కష్టమర్లతో కిటకిటలాడుతుంటుంది. మరి ఈసారి మీరు చెన్నై వెళితే తప్పకుండా ఎనియావన్ చేతి ఇడ్లీలు రుచి చూడండీ..