Vandalur zoo : తమిళనాడు జూలో మరోసారి కరోనా కల్లోలం..9 నిప్పు కోళ్లు, ఒక ఆడ సింహం మృతి

తమిళనాడులోని వండలూరు జంతు ప్రదర్శనశాలలో కరోనా వైరస్‌ కల్లోలం రేపుతోంది. నిప్పుకోళ్లు, ఓ సింహం కరోనాతో మృతి చెందాయి.

Vandalur zoo : తమిళనాడు జూలో మరోసారి కరోనా కల్లోలం..9 నిప్పు కోళ్లు, ఒక ఆడ సింహం మృతి

Lioness 9 Ostriches With Corona Dead (1)

Updated On : October 29, 2021 / 11:11 AM IST

lioness 9 Ostriches with Corona dead at the vandalur zoo : తమిళనాడులోని వండలూరు జంతు ప్రదర్శనశాలలో కరోనా వైరస్‌ కల్లోలం రేపుతోంది. జూలో ఉన్న జంతువులు, పక్షుల మీద పగబట్టిందా? అన్నట్లుగా మహమ్మారిని కలకలం రేపుతోంది. జూలో ఉన్న పలు పక్షులకు, జంతువులకు కరోనా సోకటంతో తొమ్మిది నిప్పుకోళ్లు, ఒక ఆడ సింహం మృంది చెందాయి. ఇది కేవలం రెండురోజుల వ్యవధిలోనే ఇవి ప్రాణాలు కోల్పోయిన విషయంలో గురువారం (అక్టోబర్ 28,2021)న వెలుగులోకి వచ్చింది. దీంతో వైద్య అధికారులు వెంటనే రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. ఈ వైరస్ మిగిలినవాటిపై ప్రభావం చూపకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా కరోనా లాక్‌డౌన్‌ సమయంలో వండలూరులోని అన్నా జూలో వన్యప్రాణులపై తీవ్ర ప్రభావం చూపించిన విషయం తెలిసిందే.

Read more : Lion Died With Corona: కరోనాతో సింహం మృతి.

గతంలో కరోనాతో 9 ఏళ్ల నీల అనే సింహం, 12 ఏళ్ల పద్మనాభన్ అనే సింహాలు రెండు సింహాలు మరణించాయి. అదే సమయంలో మరికొన్ని కరోనా బారిన పడడం వెలుగు చూశాయి. దీంతో జూని కొంతకాలంపాటు అధికారులు మూసివేశారు. ఆ తరువాత పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి జూని సందర్శకులకు అనుమతి ఇచ్చారు. ఈక్రమంలో మరోసారి వన్యప్రాణులపై కరోనా ప్రభావం చూపిస్తోంది.

ఈ క్రమంలో సోమవారం (అక్టోబర్ 25,2021) హఠాత్తుగా రెండు నిప్పు కోళ్లు..మరణించాయి. వీటిక కళేబరాలను అధికారులు పోస్టుమార్టం నిర్వహించి..సేకరించిన నమూనాల్ని పరిశోధనకు పంపించారు. ఈ రిపోర్టు వచ్చేలోనే బుధవారం సాయంత్రం మరో 1.5 నుండి 3 సంవత్సరాల వయస్సు గల ఏడు నిప్పు కోళ్లు మరణించడంతో వైరస్‌ కలవరం కలిగించింది. అలాగే, గతంలో కరోనా బారిన పడికోలుకున్న కవిత 19 ఏళ్ల అనే ఆడ సింహం అనారోగ్యంతో మరణించడంతో ఈ భయం మరింత పెరిగింది. అధికారులు ఇతర వన్య ప్రాణులు అనారోగ్యం బారిన పడకుండాముందు జాగ్రత్తలు చేపట్టారు.

Read more : White-Tailed Deer : మరో ముప్పు.. దుప్పుల్లో కరోనా యాంటీబాడీలు, ఆందోళనలో సైంటిస్టులు