Today Headlines: 6 గ్యారెంటీల అమలుకు సర్కార్ కసరత్తు
పథకాల అమలుకు లబ్దిదారుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందుకోసం ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన సభలు నిర్వహించనుంది సర్కార్.

Today Headlines in Telugu at 11PM
ఈ నెల 28 నుంచి ప్రజాపాలన
6 గ్యారెంటీల అమలుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటికే రెండు గ్యారెంటీలను (మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్న ప్రభుత్వం మిగిలిన పథకాల అమలుకు లబ్దిదారుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందుకోసం ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన సభలు నిర్వహించనుంది సర్కార్.
ఓటమి మంచి చేసింది: దగ్గుబాటి వెంకటేశ్వర రావు
ఏపీలోని బాపట్ల జిల్లా కారంచేడు గ్రామస్తులతో దగ్గుబాటి వెంకటేశ్వర రావు మాటామంతీలో పాల్గొన్నారు. బీజేపీ అధికారంలోలేని సమయంలోనే దగ్గుబాటి పురందేశ్వరి ఆ పార్టీలో చేరారని గుర్తు చేశారు. తాను గత ఎన్నికల్లో పర్చూరులో వైసీపీ నుంచి పోటీ చేశానని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు కారంచేడులో రోడ్లు వేయలేదని ప్రజలు అంటున్నారని దగ్గుబాటి వెంకటేశ్వర రావు చెప్పారు. గత ఎన్నికల్లో తాను గెలిస్తే ప్రస్తుత పరిస్తితుల్లో ఈ రోడ్ల మీద ఇంత స్వేచ్ఛగా తిరగలేకపోయేవాడినని అన్నారు. దేవుడి దయవల్ల పర్చూరులో తాను ఓడిపోవడమే మంచిదైందని చెప్పారు.
ఆశలు నెరవేరుస్తాం..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం పూర్తి కావటం..కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పాలన పగ్గాలు చేపట్టటం..గత ప్రభుత్వం అవినీతిని వెలికి తీస్తామని చెప్పటం..ఆ పనిలో బిజీగా ఉండటం వంటి పరిణామాలు రాష్ట్రాలో కాక రేపుతున్నాయి. ఈ క్రమంలో సింగరేణి ఎన్నికల సంగ్రామం మొదలైంది. గెలుపును కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీని కోసం మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, శ్రీధర్ బాబులు రంగంలోకి దిగారు. సింగరేణి కార్మికులకు హామీల వర్షం కురిపిస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో మోసమోయారు..తాము మీ కలలను నిజం చేస్తామంటున్నారు. కాంగ్రెస్ అనుబంధ సంఘమైన ఐఎన్‌టీయూసీని గెలిపిస్తే కార్మికుల సొంతింటి కలను నెరవేరుస్తామని హామీలు ఇచ్చారు.
చెన్నైలో దారుణం
చెన్నైలో దారుణం చోటుచేసుకుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగినిని ఓ ట్రాన్స్ జెండర్ దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నందిని అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వెట్రి మణిమారన్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. ఈక్రమంలో మణిమారన్ ట్రాన్స్ జెండర్ అని తెలిసి దూరంపెట్టింది. అది తట్టుకోలేని మరణిమారనన్ నందినిని హత్య చేసిన ఘటన చెన్నైలో వెలుగులోకి వచ్చింది. మాట్లాడాలని పిలిచి నందినిని హత్య చేసిన మృతదేహానికి నిప్పు పెట్టిన ఘనట సంచలన కలిగించింది.
ఆ తప్పులు చెయొద్దు..
పార్లమెంట్ ఎన్నికల్లోను బీఆర్ఎస్ ఓటమి తప్పదు అంటూ బీజేపీ నేత బండి సంజయ్ జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ఓటమికి కేటీఆర్ అహంకారమే కారణమన్నారు. బీఆర్ఎస్ చేసిన తప్పుల్ని కాంగ్రెస్ చేయొద్దు అంటూ బండి సూచించారు.
అనుమతుల్లేవ్..
సన్ బర్న్ ఈవెంట్ నిర్వాహకులపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. 2024 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో సన్ బర్న్ ఈవెంట్‌కు అనుమతుల్లేవని సైబరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి తెలిపారు. ఈ ఈవెంట్ కు అనుమతులు లేకుండా టికెట్లు విక్రయించటంపై కేసు నమోదు చేశారు పోలీసులు. అనుమతులు లేకుండా టికెట్లు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
రాహుల్ పై కవిత ఫైర్..
కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉంది అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. సనాతన ధర్మాన్ని అవమానించినప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు స్పందించ లేదు..? డీఎంకే నేతలు దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా మాట్లాడుతుంటే కాంగ్రెస్ ఎందుకు అదుపు చేయడం లేదు..? అని ప్రశ్నించారు. ఇండియా కూటమిలో ఉన్న డీఎంకే నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో రాహుల్ గాంధీ చెప్పాలి అని డిమాండ్ చేశారు.
లోయలో ప్రాణాలు..
జమ్ముకశ్మీర్ లోని రియాసీ జిల్లాలో రోడ్డు ప్రమాదం చేటుచేసుకుంది. ఓ వాహనం లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 13మంది తీవ్రంగా గాయపడ్డారు.
షా డైరెక్షన్స్..
డిసెంబర్ 28న కేంద్ర హోమ్ మంత్రి, బీజేపీ సీనియర్ నేతు అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఎంపీ ఎన్నికలపై ఫోకస్ పెంచిన బీజేపీ తెలంగాణలో సీట్లు సాధించాలనే లక్ష్యంగా సమావేశాలు నిర్వహిస్తోంది. దీంట్లో భాగంగా అమిత్ షా ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు షా దిశానిర్ధేశం చేయనున్నారు.
సింగరేణి ఎన్నికల ప్రచారంలో మంత్రులు
సింగరేణి ఎన్నికల ప్రచారంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి ఎన్నికల్లోను ఐ ఎన్ టి యూ సి ని గెలిపించాలని కోరారు. కార్మికుల సొంతింటి కలను నిజం చేస్తామని హామీ ఇచ్చారు.
పెరుగుతున్న కోవిడ్..
దేశంలో మరోసారి కోవిడ్ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో దక్షిణాదిలోనే ఎక్కువ కేసులు నమోదు కావటం గనమించాల్సిన విషయం. ఈక్రమంలో తెలుగు రాష్ట్రాల్లో సైతం కోవిడ్ ప్రతాపంచూసిస్తోంది. దీంట్లో భాగంగా ఏపీలోని విశాఖలో కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కోవిడ్ కేసులు 17కు పెరిగాయి.
క్రిస్మస్ వేడుకల్లో జగన్..
పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
భక్తుల రద్దీ సాధారణం..
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత, ప్రత్యేక దర్శనం టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే దర్శనానికి టీటీడీ అనుమతిస్తుంది. ఆదివారం శ్రీవారిని 63,519 మంది భక్తులు దర్శించుకున్నారు. ఆదివారం ఒక్కరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.05 కోట్లు.
అనుమతులు ఇవ్వలేదు..
సన్ బర్న్ ఈవెంట్ కు అనుమతులు ఇవ్వలేదని సైదరాబాద్ సీపీ అవినాశ్ మహంతి తెలిపారు. అనుమతి లేకుండా టికెట్లు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. బుక్ మై షో ప్రతినిధులను ఇప్పటికే హెచ్చరించామని చెప్పారు. న్యూఇయర్ ఈవెంట్ల కోసం ఎవరైనా అనుమతులు తీసుకోవాల్సిందేనని సీపీ స్పష్టం చేశారు.
నిలిచిన విద్యుత్ ఉత్పత్తి..
అనకాపల్లి జిల్లా సింహాద్రి ఎన్టీపీసీ రెండో యూనిట్ లో సాంకేతిక లోపం తలెత్తింది. బాయిలర్ ట్యాంబ్ కు లీకేజీ ఏర్పడిన కారణంగా 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. అప్రమత్తమైన అధికారులు లోపాన్ని సరిద్దే ప్రయత్నం చేస్తున్నారు.
ఫ్రాన్స్ వీడేందుకు అనుమతి ..
ఫ్రాన్స్‌లో చిక్కుకుపోయిన 303 మంది భారతీయులకు ఆటంకాలు తొలగిపోయాయి. సోమవారం వారి విమానం ఫ్రాన్స్‌ను వీడేందుకు అనుమతించినట్టు స్థానిక అధికారులు తెలిపారు. అయితే, మునుపటి షెడ్యూల్ ప్రకారం విమానం నికరాగువాకు వెళుతుందా? లేక భారత్‌కు వస్తుందా? అన్న దానిపై స్పష్టత లేదు.
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు..
క్రిస్మస్ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్న క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు. సమాజంలోని బాధితుల పక్షాన నిలబడి ప్రేమను పంచడం… అందరిని సమదృష్టితో చూడటం ద్వారా క్రీస్తు ఆశించిన శాంతియుత సమాజ స్థాపనకు కృషి చేద్దాం.#Christmas
— N Chandrababu Naidu (@ncbn) December 24, 2023
ఘోర రోడ్డు ప్రమాదం..
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో, లారీ ఢీకొనడంతో నలుగురు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. నిడమనూరు మండలం వెంపాడ్ స్టేజి దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు..
తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనల్లో భక్తులు పాల్గొన్నారు. విజయవాడలోని గుణదల మేరీ మాత ఆలయానికి భక్తులు పోటెత్తారు. మరోవైపు మెదక్ సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. మొదటి ఆరాధనతో బిషప్ కె. పద్మరావ్ వేడుకలను ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మెదక్ చర్చి వద్దకు తరలివచ్చి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు.
ఏపీపై కాంగ్రెస్ ఫోకస్ ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈనెల 27న ఏఐసీసీలో ఏపీ కాంగ్రెస్ నేతలతో కీలక సమావేశం నిర్వహించనుంది. ఏపీ కాంగ్రెస్ నేతలతో జాతీయ పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ భేటీ కానున్నారు. ఏపీపీసీసీ చీఫ్ రుద్రరాజు, కొత్త ఇన్ ఛార్జి మాణిక్యం ఠాగూర్ సహా ఏపీ ముఖ్యనేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై చర్చించనున్నారు.