చెత్తడంప్ లో నాలుగు అస్థిపంజరాలు..వణికిపోతున్న ప్రజలు

  • Published By: nagamani ,Published On : December 8, 2020 / 09:56 AM IST
చెత్తడంప్ లో నాలుగు అస్థిపంజరాలు..వణికిపోతున్న ప్రజలు

Updated On : December 8, 2020 / 10:07 AM IST

UP Kanpur colony four human skeletons recovered : ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌లోని పంకి ప్రాంతంలోని కాశీరామ్ కాలనీ ముందు ఉన్న చెత్త డంప్‌లో నాలుగు అస్థిపంజరాలు కలకలం సృష్టించాయి. నాలుగు మానవ అస్థి పంజరాలు లభించిన ఘటన స్థానికులను దిగ్ర్భాంతికి గురిచేసింది.


కాన్పూర్ లోని పంకీ కాలనీలో నాలుగు మానవ అస్థిపంజరాలను సోమవారం (డిసెంబర్ 7,2020)పోలీసులు గుర్తించారు.దీంతో ఒక్కసారిగా స్థానికులు భయంతో వణికిపోతున్నారు.




పంకీ కాలనీలో నాలుగు అస్థి పంజరాలు లభించడంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నలుగురిని ఎవరైనా హత్య చేశారా? లేదా వారే సామూహికంగా ఆత్మహత్య చేసుకున్నారా? అనేకోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.



ఈ ఘటనపై కాన్పూర్ జిల్లా ఎస్పీ అనిల్ కుమార్ మాట్లాడుతూ..పంకీ కాలనీలో లభ్యమైనా నాలుగు అస్థిపంజరాలు లభ్యమయ్యాయని..వాటిని స్వాధీనం చేసుకుని పరీక్షల కోసం తరలించామని తెలిపారు.



అవి చాలా పాతకాలంనాటివనీ పెద్ద వయస్సు ఉన్న వారివేనని తెలిపారు. ఈ నాలుగు అస్థిపంజరాలను పరీక్ష కోసం ల్యాబ్ కు తరలించామని రిపోర్టులు వచ్చిన తరువాత ఓ నిర్థారణకు వచ్చే అవకాశముందని ఎస్పీ అనిల్ కుమార్ తెలిపారు.