దేశంలో కొత్త వైరస్, ఇది కరోనా కంటే ప్రమాదం కాదు, సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్

కరోనా వైరస్ కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం చాలా బాగా పని చేస్తోందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా టెన్ టీవీతో చెప్పారు. మహారాష్ట్రలో ఆసుపత్రుల దగ్గరున్న పరిస్థితి

  • Published By: naveen ,Published On : June 4, 2020 / 11:33 AM IST
దేశంలో కొత్త వైరస్, ఇది కరోనా కంటే ప్రమాదం కాదు, సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్

Updated On : June 4, 2020 / 11:33 AM IST

కరోనా వైరస్ కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం చాలా బాగా పని చేస్తోందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా టెన్ టీవీతో చెప్పారు. మహారాష్ట్రలో ఆసుపత్రుల దగ్గరున్న పరిస్థితి

కరోనా వైరస్ కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం చాలా బాగా పని చేస్తోందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా టెన్ టీవీతో చెప్పారు. మహారాష్ట్రలో ఆసుపత్రుల దగ్గరున్న పరిస్థితి తెలంగాణలో లేదన్నారు. పకడ్బందీ ఏర్పాట్లతో నాణ్యమైన సేవలు తెలంగాణ ప్రభుత్వం అందిస్తోందన్నారు. లాక్ డౌన్ పోయినా ఇంకా వైరస్ ఇక్కడే ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రాకేశ్ చెప్పారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తేనే కరోనా కట్టడి సాధ్యం అన్నారు. కరోనా పరీక్షలు ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిదన్నారు. టెస్టులు ఎక్కువ చేయకపోతే అదృష్టంపై ఆధారపడాల్సి ఉంటుందన్నారు.

రాష్ట్రంలో ర్యాండమ్ టెస్టులు చేయడం చాలా మంచిదన్నారు. వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం తప్పక పాటించాలన్నారు. మన దేశంలో ఇప్పుడు క్లెయిడ్ A 3i రకం వైరస్ 40శాతం మందిలో ఉందన్నారు. సౌత్ ఈస్ట్ ఆసియా నుంచి ఈ వైరస్ వచ్చిందని తమ పరిశోధనలో తేలిందన్నారు. కాగా ఈ వైరస్ కరోనా కంటే ప్రమాదకారి కాదన్నారు. 

సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా:
* క్లెయిడ్ A3i రకం వైరస్ దేశంలో 40శాతం మందిలో ఉంది
* సౌత్ ఈస్ట్ ఆసియా నుంచి ఈ వైరస్ వచ్చింది
* క్లెయిడ్ వైరస్, చైనాలో వెలుగుచూసిన కరోనా కంటే తక్కువ తీవ్రత ఉండటం అదృష్టం
* క్లెయిడ్ వైరస్ కరోనా కంటే ప్రమాదకరమైనది కాదు
* ఎలాంటి వైరస్ అయినా, వ్యక్తిగత శుభ్రతే మనల్ని కాపాడుతుంది
* ప్రభుత్వాలు చెప్పిన మాట ప్రజలు వినాలి
* ప్రభుత్వాలను ప్రజలు అర్థం చేసుకోవాలి
* ఎక్కువ టెస్టులు చేయకపోతే అదృష్టంపై ఆధారపడాల్సి ఉంటుంది

* తెలంగాణలో వైరస్ రూపు మార్చుకుందా?
* మన దగ్గర కరోనా అంత ప్రాణాంతకమైంది కాదా?
* వుహాన్ వైరస్ అంత ప్రమాదకరమైంది కాదంటున్న సీసీఎంబీ శాస్త్రవేత్తలు
* జాగ్రత్తలతో వైరస్ నుంచి రక్షణ పొంద వచ్చంటున్న శాస్త్రవేత్తలు
* భౌతికదూరం, వ్యక్తిగత శుభ్రతతో వైరస్ ను అడ్డుకోవచ్చు

తెలంగాణలో 3వేలు దాటిన కరోనా కేసులు, 99మరణాలు:
కాగా, తెలంగాణలో బుధవారం(జూన్ 3,2020) ఒక్కరోజులో భారీగా కరోనా కేసులు బయటపడ్డాయి. 24 గంటల్లో 129 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో 127 కరోనా కేసులు రాష్ట్రానికి చెందినవి కాగా, మరో 2 కరోనా కేసులు వలస కార్మికులకు చెందినవి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,020కు చేరుకుంది. అయితే, లోకల్ కేసులు మాత్రం 2,572 అని హెల్త్ బులెటిన్‌లో వివరించారు. బుధవారం మరో ఏడుగురు కరోనాతో చనిపోయారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 99కి చేరుకుంది.

బుధవారం గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ కొత్తగా కేసులు నమోదుకావడం కలవరపెడుతోంది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 108 కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 6, ఆసిఫాబాద్‌లో 6, మేడ్చల్‌, సిరిసిల్లలో 2 కేసుల చొప్పున, యాదాద్రి, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులను గుర్తించారు. ఇక నాన్ లోకల్ కేసుల్లో ఇద్దరు వలస కార్మికులకు కరోనా సోకింది. ఇప్పటి వరకూ కరోనా నుంచి 1556 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 1,365.