Positive Parenting Tips : మీ పిల్లలతో అనుబంధం పెంచే 10 సూత్రాలు

పిల్లల అభిరుచులను గౌరవించండి. మీరు కూడా వాటి పట్ల ఇంట్రెస్టు చూపండి. వాళ్లకు డ్యాన్స్ ఇష్టమైతే దాని గురించి మాట్లాడండి, వాళ్లు చెప్పేది వినండి. ఆర్ట్ ఇష్టమైతే దాని గురించి చెప్పండి. వాళ్ల అభిరుచులను మెరుగుపరుచుకునేలా ప్రోత్సహించండి.

Positive Parenting Tips : మీ పిల్లలతో అనుబంధం పెంచే 10 సూత్రాలు

Positive Parenting

Positive Parenting Tips : ఒకప్పుడు పిల్లలకు తండ్రి అంటే చండశాసనుడు. తల్లి అంటే ఆకలనగానే అన్నం పెట్టి, ముద్దు చేసేది మాత్రమే. కానీ ఏ విషయం అయినా షేర్ చేసుకోగలిగేంత అనుబంధం పిల్లలకు తల్లిదండ్రులతో ఉండేది కాదు. కానీ ఇప్పుడు తరం మారింది. తల్లిదండ్రులు కూడా పిల్లలకు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండగలగాలని అనుకుంటున్నారు.

READ ALSO : Dental Health : దంత ఆరోగ్యం విషయంలో చాలా మందిలో నెలకొన్న అపోహలు Vs వాస్తవాలు !

పేరెంట్స్ కి పిల్లలకి ఒకరి పట్ల ఒకరికి అండర్ స్టాండింగ్, నమ్మకం, స్నేహం ఉంటే ఇక పిల్లలు ఏ విషయాలకు కూడా భయపడరు. ఏ సమస్య వచ్చినా ముందు తల్లిదండ్రుల తోనే పంచుకుంటారు. తల్లిదండ్రులు పిల్లలకు ఒక సపోర్ట్ సిస్టమ్ గా డెవలప్ అవుతారు. దానివల్ల వాళ్లు తప్పుదారి పట్టకుండా కాపాడుకోగలుగుతారు. కొంచెం ఓపిక, కొంచెం సహానుభూతి, సరైన ప్రయత్నం ఉంటే మీ పిల్లలతో ఇలాంటి అనుబంధాన్ని పెంచుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది.

  1. సమయం వెచ్చించండి

ఎన్ని పనులున్నా, ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ కొంత సమయాన్ని పిల్లల కోసం కేటాయించండి. వంట చేసుకుంటూనే వాళ్లతో కబుర్లు చెప్పవచ్చు. ఆఫీసు పని చేస్తూనే వాళ్ల చదువు గురించి విచారించవచ్చు. వాళ్లతో కలిసి ఆడుకోవచ్చు. కలిసి ఎక్సర్ సైజ్ చేయవచ్చు. అలా వాకింగ్ చేస్తూ మాట్లాడుకోవచ్చు. ఈ మాటల్లో చదువు, మార్కులు మాత్రమే కాదు.. వాళ్ల స్కూలు, కాలేజీ, స్నేహితులు, సినిమాలు, సామాజిక తీరుతెన్నులు, రిలేషన్స్, రాజకీయాలు, క్రీడలు… ఇలా పిల్లలతో ఏ విషయమైనా చర్చించవచ్చు. దానివల్ల వాళ్లతో క్వాలిటీ టైం స్పెండ్ చేయగలుగుతారు. అదే సమయంలో చర్చల ద్వారా పిల్లల నాలెడ్జ్, మెచ్యూరిటీ లెవల్స్ కూడా పెరుగుతాయి.

READ ALSO : Skin Diseases In Diabetics : మధుమేహ బాధితుల్లో చర్మ వ్యాధులను ప్రేరేపించే వర్షాకాలం.. చర్మ ఆరోగ్యం కోసం అనుసరించాల్సిన విధానాలు !

  1. వారు చెప్పేది వినండి 

చిన్న పిల్లల దగ్గరి నుంచి టీనేజి పిల్లలు, కాలేజీ పిల్లలు.. వయసు ఏదైనా సరే వాళ్లు చెప్పే ప్రతిమాటా శ్రద్ధగా వినండి. వాళ్లు చెప్పే విషయాలు మీకు బోర్ కొట్టినా సరే మధ్యలో వాళ్లను చెప్పనీయకుండా అడ్డుకోకండి. ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లలు చెప్పే విషయాలను జడ్జ్ చేయకండి. ఏదైనా సంఘటన గురించైనా లేక ఇంకేదైనా విషయమైనా దాని గురించి వాళ్ల భావాలను, ఆలోచనలను, ఉద్దేశాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచేలాగా ప్రోత్సహించండి. అవసరమైనప్పుడు సపోర్ట్ గా నిలబడండి. పొరపాటు చేస్తున్నారనుకుంటే గైడ్ చేయండి. సమస్యలో ఉన్నారనుకుంటే ఎంపతీ చూపించండి. ఏది ఏమైనా వాళ్ల కోసం తోడుగామీరున్నారనేఫీలింగ్ నీ, నమ్మకాన్నీ వాళ్లకు కలిగించండి.

  1. అభిరుచులు పంచుకోండి

మీ పిల్లల అభిరుచులను గౌరవించండి. మీరు కూడా వాటి పట్ల ఇంట్రెస్టు చూపండి. వాళ్లకు డ్యాన్స్ ఇష్టమైతే దాని గురించి మాట్లాడండి, వాళ్లు చెప్పేది వినండి. ఆర్ట్ ఇష్టమైతే దాని గురించి చెప్పండి. వాళ్ల అభిరుచులను మెరుగుపరుచుకునేలా ప్రోత్సహించండి. వాటి గురించి మరింత సమాచారం సేకరించి చెప్పండి. పిల్లలు తమకు ముఖ్యమనుకుంటున్న విషయాల గురించి మీరు కూడా చర్చించండి. అప్పుడు వాళ్ల అభిప్రాయాలను మీరు గౌరవిస్తున్నారని వాళ్లు భావిస్తారు.

READ ALSO : Reproductive Health : పురుషులు పునరుత్పత్తి ఆరోగ్యం గురించి తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్యమైన వాస్తవాలు !

  1. కమ్యూనికేషన్

మీ పిల్లలు మీతో ఏ విషయాన్ని అయినా నిర్భయంగా పంచుకోగలిగే వాతావరణాన్ని కలిగించండి. ఏ విషయాన్ని అయినా వాళ్లు నిస్సందేహంగా మీతో కమ్యూనికేట్ చేయగలిగేలా చూడండి. మీరు జడ్జ్ మెంటల్ గా లేకుండా పిల్లలు అభిప్రాయాలను, ఆలోచనలను, కలలు, లక్ష్యాలను, సవాళ్లను గురించి విమర్శించకుండా ఉండండి.

  1. స్వతంత్ర భావాలు

పిల్లల ఇండివిడ్యువాలిటీని గౌరవించండి. వాళ్లలోని స్వతంత్ర భావాలను గుర్తించండి. వాళ్లు ఎంచుకున్న విషయాలు, ఎమోషన్స్, అభిప్రాయాలను నిక్కచ్చిగా విమర్శించకుండా సున్నితంగా వ్యవహరించండి. పిల్లలు తమ సొంత ఐడెంటిటీని ఏర్పరుచుకునే విధంగా తయారుచేయండి. ఇది వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

READ ALSO : Actress Praneetha: ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో బాదం ఉండాల్సిందే

  1. రోల్ మోడల్

పిల్లలు ఎప్పుడైనా మనం చెప్పిన దానికన్నా, మనల్ని చూసి నేర్చుకునేదే ఎక్కువ. అందుకే మీ పిల్లలు ఎలా ఉండాలని మీరు ఆశిస్తున్నారో ముందు మీరు అలా మెలగండి. వాళ్లకు ఒక రోల్ మోడల్ లాగా ఉండండి. ఇతరుల పట్ల దయతో, సహానుభూతితో, ఒక పాజిటివ్ బిహేవియర్ ను మీరు చూపిస్తే మీ పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. అందుకే ఒక ఆరోగ్యకరమైన కమ్యూనికేషన్, సమస్యల పరిష్కారం, ఎమోషన్స్ ని మేనేజ్ చేయడం.. ఇలాంటివన్నీ మీ ప్రవర్తన ద్వారా చూపించండి.

  1. క్రమశిక్షణ వర్సెస్ స్వేచ్ఛ

పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాలనే అభిప్రాయంతో కొందరు క్రమశిక్షణ నేర్పడం మరిచిపోతారు. డిసిప్లిన్ కీ, ఫ్రీడమ్ కి మధ్యలో బ్యాలెన్స్ ఉండేలా చూసుకోండి. వాళ్ల స్వేచ్ఛకు కూడా పరిమితులు ఉంచండి. ఆ పరిధిలోనే వాళ్లు ఏవైనాఎంచుకోవచ్చని చెప్పండి. డిసిప్లిన్ ని కూడా ఒక పనిష్‌మెంట్ లాగా కాకుండా ఒక పాఠంలా నేర్పండి. తమ తప్పుల నుంచి నేర్చుకునేట్టుగా వాళ్లను తయారుచేయండి.

READ ALSO : Vitamin D : విటమిన్ డి నోటి ఆరోగ్యం పై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది?

  1. విజయాల సెలబ్రేషన్

మీ పిల్లలు ఏ చిన్న విజయం సాధించినా సరే దాన్ని గుర్తించండి. వాళ్లను ఎంకరేజ్ చేసే విధంగా ఆ సక్సెస్ ని సెలబ్రేట్ చేయండి. వాళ్లు చేసిన ప్రయత్నాన్ని పొగడండి. వాళ్లు సాధించినదానికి మీ గర్వాన్ని వ్యక్తం చేయండి. దీనివల్ల వాళ్లలో ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా మీ మధ్య రిలేషన్ ని స్ట్రాంగ్ చేస్తుంది.

  1. నమ్మకం పోగొట్టుకోవద్దు

పిల్లలకు మీ పట్ల ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. అంటే వాళ్లకు ఇచ్చిన ప్రామిస్ లు ఎప్పుడూ కూడా మిస్ చేయొద్దు. ఏ రిలేషన్ కి అయినా నమ్మకమే పునాది అనిమరువకండి.

READ ALSO : Benefits Of Garlic : క్యాన్సర్ నివారణకు, జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగుపరచటంలో వెల్లుల్లి ఆరోగ్య ప్రయోజనాలు !

  1. సెన్సాఫ్ హ్యూమర్

తల్లిదండ్రులంటేమీరేదో పిల్లల బాస్ లు అన్నట్టుగా ఉండొద్దు. సీరియస్ ముఖాలతో, పిల్లలు మాట్లాడాలంటేనే భయపడేట్టు ఉండొద్దు. కాస్త జోవియల్ గా కూడా మెలగండి. సందర్భానుసారంగాజోక్స్ చెప్పుకోండి. వాళ్లు చెప్పిన వాటికి వాళ్లతో కలిసి మనసారా నవ్వండి. ఇలాంటి సరదా మూమెంట్స్ జీవితకాలం అనుబంధాన్ని గట్టిపరుస్తాయి.