Vitamin C : విటమిన్ సి నిజంగానే జలుబును నయం చేయగలదా?
కొన్ని విటమిన్లు, మినరల్స్ , ప్రొటీన్లు శరీరానికి సరిపడకపోతే అవి అలెర్జీని కలిగిస్తాయి. అదే విధంగా విటమిన్ సి వల్ల శరీరానికి మేలు కలుగుతుందో లేదో తెలుసుకోవటం అవసరం. ఎంతమోతాదులో విటమిన్ సి తీసుకోవం మంచిదో తెలుసుకోవాలి.

Vitamin C
Vitamin C : జలుబు, గొంతునొప్పి, తేలికపాటి జ్వరం, దగ్గు వంటి సాధారణ సమస్యలు ఉన్న సందర్భంలో వాటి నుండి బయటపడేందుకు వివిధ రకాల పద్దతులను అనుసరిస్తుండటం సర్వసాధారణం. అయితే సాధారణంగా చాలా మందిలో జలుబు సమస్య వేధిస్తుంటుంది. జలుబు అనేది అంటువ్యాధి. తరచుగా వచ్చే వ్యాధి, ఇది ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది. విటమిన్ సి మీ జలుబును నయం చేస్తుందని అటు ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. అయితే ఈ విషయంలో చాలా మందిలో అనేక సందేహాలు ఉన్నాయి. ఇది నిజమేనా అని ఆలోచించేవారి సంఖ్యే ఎక్కువ. అయితే విటమిన్ సి మోతాదులు జలుబును ఎలా నయం చేయగలవో తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం..
విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థ సమృద్ధిగా ఉండే యాంటీ-ఆక్సిడెంట్, విటమిన్ సి కొల్లాజెన్‌ను ఏర్పరుస్తుంది, ఇది ఒకరి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన విటమిన్. అందువలన, ఇది స్కర్వీ వంటి చర్మ రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. రోగనిరోధక వ్యవస్థకు ఒక బూస్టర్ గా తోడ్పడుతుంది. విటమిన్ సి కూడా తెల్లకణాలను సాధారణ జలుబుతో పోరాడేలా ప్రేరేపిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే వాస్తవానికి పరిశోధనల్లో ఈ విషయం ధృవీకరించలేకపోయినప్పటికీ, జలుబు యొక్క తీవ్రతను, దాని వ్యవధిని తగ్గిస్తుంది.
కొన్ని విటమిన్లు, మినరల్స్ , ప్రొటీన్లు శరీరానికి సరిపడకపోతే అవి అలెర్జీని కలిగిస్తాయి. అదే విధంగా విటమిన్ సి వల్ల శరీరానికి మేలు కలుగుతుందో లేదో తెలుసుకోవటం అవసరం. ఎంతమోతాదులో విటమిన్ సి తీసుకోవం మంచిదో తెలుసుకోవాలి. పండ్లు మరియు కూరగాయలు వంటి సహజ విటమిన్ సి మూలాలు. ఇవి మనిషికి సరిపోతాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అదనపు సప్లిమెంట్లను తీసుకోవటం ఏమాత్రం అవసరం లేదు. శరీరానికి విటమిన్ సి అవసరమని వైద్యులు సూచించినప్పుడు మాత్రమే సప్లిమెంట్లను వాడాలి.
విటమిన్ సి శరీరానికి అసరమైన నేపధ్యంలో సహజ వనరుల ద్వారా దానిని పొందాలి. ఈ విటమిన్ ఉన్న సహజ ఆహారాలను తీసుకోవటం ద్వారా దీనిని పొందవచ్చు. బెల్ పెప్పర్స్ , జామపండ్లు అన్ని ఆకు కూరలు, కివి, బ్రోకలీ, బెర్రీలు, అన్ని సిట్రస్ పండ్లు, టమోటాలు, బటానీలు, బొప్పాయి వంటి వాటిలో సి విటమిన్ లభిస్తుంది.
విటమిన్ సి తీసుకోవడం వల్ల జలుబు యొక్క తీవ్రతను తగ్గించకపోయినప్పటీకి, శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. జలుబు వచ్చాక ఎక్కవ రోజులు దాని ప్రభావం లేకుండా చూసేందుకు విటమిన్ సి తోడ్పడుతుంది. అంతేకాకుండా విటమిన్ సి క్యాన్సర్ కార్డియోవాస్కులర్ దాడులను నిరోధించడంలో సహాయపడుతుంది.