Neck Pain : మెడనొప్పికి దారితీసే రోజువారి పొరపాట్లు!

నిద్రించే సమయంలో తలకింద పెట్టుకునే దిండును సరైన దానికి ఎంపిక చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా, మరీ ఎత్తుగా లేకుండా మధ్యస్థంగా ఉండే దిండులను తలగడగా ఉపయోగించాలి. కొంతమంది దిండుని సరిగా ఎంపిక చేసుకోరు.

Neck Pain : మెడనొప్పికి దారితీసే రోజువారి పొరపాట్లు!

Neck Pain (1)

Updated On : May 1, 2022 / 12:47 PM IST

Neck Pain : శరీరంలోని అతిముఖ్యమైన భాగాల్లో మెడ కూడా ఒకటి. రోజువారి జీవితంలో మనం చేసే వివిధ రకాల తప్పిదాల వల్ల మెడనొప్పి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. మెడనొప్పికి అనేక కారణాలు ఉన్నాయి. మజిల్ టెన్షన్, మజిల్ స్ట్రెయిన్, కూర్చొనే భంగిమ సరిగా లేకపోవడం, ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం. నిద్రించే భంగిమ సరిగా లేకపోవడం, వ్యాయామం చేసే సమయంలో మెడ కండరాలు పట్టడం. పోషకాహార లోపం, మెడ గాయాలు, నరాలపై ఒత్తిడి, సర్వికల్ స్పాండిలోసిస్ మొదలగు ఇతర కారణాల వల్ల మెడనొప్పి సమ్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇటీవలి కాలంలో స్మార్ట్‌ఫోను వినియోగం బాగా పెరిగిపోయింది. దీంతో మెడనొప్పుల సమస్యలు అధికమయ్యాయి. ఫోను ను వదిలి క్షణం కూడా ఉండలేకపోవటం, ఒకే భంగిమలో ఫోన్ ను చూడటం వల్ల మెడపై వత్తిడిపడుతుంది. అదే క్రమంలో భుజాల నొప్పిులు కూడా వస్తాయి. కొన్ని సందర్భాల్లో ఈ నొప్పుల తీవ్రత అధికంగా ఉంటుంది. ఫోనుని కంటికి సమాంతరంగా ఉంచుకుని చూసే విధంగా అమర్చు కోవటం మంచిది. దీని వల్ల చాలా వరకు మెడనొప్పులు రాకుండా చూసుకోవచ్చు. వెల్లకిలా, బోర్లా పొడుకుని నిద్రపోయే వారిలోమెడనొప్పుల సమస్య వస్తుంది. ఇలా పడుకోవటం వల్ల మెడనరాలపై భారంపడే అవకాశం ఉంటుంది. ఒకవైపుకు తిరిగి పడుకోవటం మంచిది.

బరువుని ఎత్తేసమయంలో వంగిపోయి అమాంతం ఎత్తడం చేయటం మంచిది కాదు. ఇలా చేయటం వల్ల నడుము పట్టేయటంతోపాటు, మెడ నరాలపై కూడా వత్తిడి పడుతుంది. మోకాళ్ళపై కూర్చని నిదానంగా బరువులను ఎత్తటం వంటివి చేయాలి. కాలేజీ విద్యార్ధులు, ఉద్యోగినులూ బ్యాగ్స్ ను ఒక భుజానికి తగిలించుకుంటారు. దీని వల్ల భుజంగా భారం పడుతుంది. దాని వల్ల మెడా , వెన్ను భాగాల్లో నొప్పులువస్తాయి. బ్యాగును రెండు భూజాలకీ తగిలించుకోవటం అలవాటు చేసుకోవాలి. బ్యాగుకు ఉండే పట్టీలను బిగుతుగా ఉండేలా బిగించుకోవాలి. దీని వల్ల మెడ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

నిద్రించే సమయంలో తలకింద పెట్టుకునే దిండును సరైన దానికి ఎంపిక చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా, మరీ ఎత్తుగా లేకుండా మధ్యస్థంగా ఉండే దిండులను తలగడగా ఉపయోగించాలి. కొంతమంది దిండుని సరిగా ఎంపిక చేసుకోరు. అలాకాకుండా ఎత్తైన దిండ్లను తలగడగా వాడటం వల్ల వెన్నుముక, మెడ సమస్యలు వస్తాయి. కంప్యూటర్‌ ముందు కూర్చీలో కూర్చునేవారు మరీ ముందుకు వంగి కూర్చోవటం కానీ, వెనక్కి కూర్చోవటం కాని చేయకూడదు. కంప్యూటర్ తెరకు ఎదురుగా కూర్చోవడం అలవాటు చేసుకోవాలి.