Deleted Messages : మీ లైఫ్ పార్టనర్ మెసేజస్, చాట్ డిలీట్ చేస్తున్నారా? అయితే..

కొంతమంది సెల్ ఫోన్‌లో వాట్సాప్ చాట్, మెసేజ్‌లు డిలీట్ చేస్తుంటారు. తమ జీవిత భాగస్వామి చూడకూడదని అలర్ట్ అవుతారు. భార్యభర్తల మధ్య సీక్రెట్స్ ఉంటాయా? ఇలా చేయడం వల్ల బంధాలు నిలబడతాయా? చదవండి.

Deleted Messages : మీ లైఫ్ పార్టనర్ మెసేజస్, చాట్ డిలీట్ చేస్తున్నారా? అయితే..

Deleted Messages

Updated On : August 9, 2023 / 2:35 PM IST

Deleted Messages : ఏ బంధమైన నమ్మకంతో ముడిపడి ఉంటుంది. ఒకే ఒక్క మెసేజ్ లేదా చాట్ బంధాల్ని బ్రేక్ చేస్తుందా? రెండు మనసుల మధ్య అనుమానాలకు తావిస్తుందా? చదవండి.

Heart Emoji : అక్కడంతే..వాట్సాప్ లో హార్ట్ ఎమోజీ పంపితే రూ.20 లక్షల జరిమానా, జైలుశిక్ష కూడా

ఇప్పుడంతా డిజిటల్ యుగం. ఏ పని కోసం అయినా ఫోన్ ఆశ్రయించడం తప్పదు. ప్రతిరోజు చాలామందితో మాట్లాడుతూ ఉంటాం. కొందరితో చాట్ కూడా చేయాల్సి వస్తుంది. లైఫ్ పార్టనర్స్‌లో ఒకరిపై ఒకరికి నమ్మకం చాలా ముఖ్యం. లేదంటే ప్రతీదీ అనుమానానికి తావిస్తుంది. ప్రతి ఒక్కరికి వారి ఫోన్ విషయంలో ప్రైవసీ కోరుకోవడం తప్పు లేదు. లైఫ్ పార్టనర్‌కి అనుమానం రాకూడదని కొందరు చాట్‌ను డిలీట్ చేస్తుంటారు. నిజానికి భార్యాభర్తల్లో ఒకరి ఫోన్ ఒకరు చెక్ చేసుకోవడం అంటేనే ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం లేకపోవడమే.

 

ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ విషయంలో కొన్ని వ్యక్తిగత అంశాలు ఉంటాయి. లైఫ్ పార్టనర్‌కి అన్ని పంచుకోవడం అసౌకర్యంగా అనిపించవచ్చును. మీకు తెలుసుకోవాలని అనిపించినా ప్రతి విషయం చెప్పమని బలవంతం కూడా చేయలేరు. కుటుంబ సభ్యులతో చాట్ చేసే కొందరు అవి తన జీవిత భాగస్వామికి అవసరం లేని అంశాలని డిలీట్ చేస్తుంటారు. అవి చూసి లేని పోని గొడవలు అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తారు.

Andhra Praedesh : ఫేస్ బుక్ కలిపింది ఇద్దరిని .. చిత్తూరు యువకుడిని పెళ్లాడిన శ్రీలంక యువతి

కొంతమంది తమ పాత స్నేహితులతో, సహోద్యోగులతో చాలా సరదాగా ఉంటారు. వారితో తమకు సంబంధించిన ప్రతి అంశాన్ని పంచుకుంటారు. లేదంటే కొత్త స్నేహితులతో పరిచయాలకు ఇష్టపడతారు. ఇవన్నీ జీవిత భాగస్వామి చూస్తే అపార్థం చేసుకోవచ్చనే అనుమానంతో కూడా అవతలి వారితో చేసిన చాట్, మెసేజ్‌లు తొలగిస్తారు. కొన్ని సున్నితమైన విషయాలను కూడా సీక్రెట్‌గా ఉంచాలని భావిస్తారు. జీవిత భాగస్వామితో పాటు మరెవరూ వాటిని చదవకుండా తొలగిస్తారు. ఇలా చేయడం మోసమేనా? అంటే మోసం క్రిందకే వస్తుంది. ఈ పని తప్పు అని మీకు తెలుసు.

 

జీవిత భాగస్వామితో ప్రతి విషయం పంచుకోలేకపోయినా జీవితంలో అతి ముఖ్యమైన అంశాలను పెళ్లికి ముందు షేర్ చేసుకుంటే ఎటువంటి సమస్యలు రావు. లేదంటే ఎక్కువ కాలం మీ బంధాన్ని కొనసాగించడం కష్టం. ఇది మరింత ముందుకు వెళ్తే అనుమానాలు, గొడవలకు తావిస్తుంది. బంధాలు బ్రేక్ చేసుకునే వరకూ వెళ్తుంది. కాబట్టి మీ లైఫ్ పార్టనర్‌కు మీ సెల్ ఫోన్ చెక్ చేయాలనే ఆలోచన రాకూడదంటే మీపై అంత నమ్మకం ఉండాలి. లేదంటే జీవిత కాలం మెసేజ్‌లు, చాట్‌లు డిలీట్ చేసుకోవాల్సిన సమస్య తప్పదు.

Jharkhand : ప్రేమ జంటను కలిపిన ఇన్‌స్టాగ్రామ్.. ప్రియుడి కోసం పోలెండ్ నుంచి జార్ఖండ్ వచ్చిన మహిళ