Happy Married Life: యోగి బాబుకి పెళ్లయింది

  • Published By: vamsi ,Published On : February 5, 2020 / 06:13 AM IST
Happy Married Life: యోగి బాబుకి పెళ్లయింది

Updated On : February 5, 2020 / 6:13 AM IST

తమిళ సినిమాలతో కోలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకున్న కమెడియన్ యోగిబాబు. తనదైన శైలి నటనతో యోగిబాబు తమిళ ఇండస్ట్రీలోనే కాదు.. డబ్బింగ్ సినిమాల ద్వారా మిగిలిన ఇండస్ట్రీల్లోనూ పేరు తెచ్చుకున్నారు. రింగుల జుట్టుతో భారీ శరీరంతో ప్రత్యేకంగా కనిపించే హావభావాలతో పంచులు వేసే యోగి బాబు.. లేకుండా రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ సినిమాలు పూర్తవ్వట్లేదు. రీసెంట్ గా దర్బార్ లోకూడా యోగిబాబు ఓ క్యారెక్టర్ చేశాడు. 

ఈ యువ కమెడియన్ ఇప్పుడు పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. తమిళనాడు తిరుత్తునికి చెందిన మంజు అని యువతిని పెళ్లి చేసుకున్నాడు యోగి. తిరుత్తణిలోని మురుగన్‌ ఆలయంలో బుధవారం(05 ఫిబ్రవరి 2020) ఉదయం మంజు భార్గవితో ఆయన వివాహం జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులతోపాటు అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

అయితే సినీ పరిశ్రమలోని తన సన్నిహితుల కోసం యోగి త్వరలోనే చెన్నైలో గ్రాండ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నారట. యోగి, భార్గవిలది పెద్దలు కుదిర్చిన వివాహం. ప్రస్తుతం మారి సెల్వరాజ్‌ దర్శకత్వంలో ధనుష్‌ హీరో తెరకెక్కుతున్న కర్ణన్‌ సినిమాలో ఓ పాత్రలో యోగి నటిస్తున్నాడు.