Adult Films Case: సినీనటి గెహనా ముందస్తు బెయిల్ తిరస్కరణ

ప్రముఖ బాలీవుడ్ నటీ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ కేసులో నిందితురాలిగా ఉన్న సినీనటి గెహనా వశిష్ట్ (Gehana Vasisht) ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ముంబై సెషన్స్ కోర్టు (Mumabi sessions court) తిరస్కరించింది. అడల్ట్ ఫిల్మ్స్ కేసుపై ముంబై కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణలో భాగంగా నిందితురాలు గెహనాపై ఆరోపణలు చాలా తీవ్రమైనవిగా కోర్టు పేర్కొంది.

Adult Films Case: సినీనటి గెహనా ముందస్తు బెయిల్ తిరస్కరణ

Adult Films Case Mumbai Court Denies Anticipatory Bail To Gehana Vasisht

Updated On : August 13, 2021 / 5:53 PM IST

Anticipatory Bail to Gehana Vasisht : ప్రముఖ బాలీవుడ్ నటీ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ కేసులో నిందితురాలిగా ఉన్న సినీనటి గెహనా వశిష్ట్ (Gehana Vasisht) ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ముంబై సెషన్స్ కోర్టు (Mumabi sessions court) తిరస్కరించింది. అడల్ట్ ఫిల్మ్స్ కేసుపై ముంబై కోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణలో భాగంగా నిందితురాలు గెహనాపై ఆరోపణలు చాలా తీవ్రమైనవిగా కోర్టు పేర్కొంది. పోలీసు కస్టడీకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని తెలిపింది. గెహనాకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి సరైన ఆధారాలేమి లేవని కోర్టు అభిప్రాయపడింది.

అశ్లీల వీడియోల చిత్రీకరణలో ఫిర్యాదు చేసిన 21ఏళ్ల యువతిని బెదిరించటంలో గెహనా పాత్ర కీలకమని పోలీసులు కోర్టుకు విన్నవించారు. గతంలోనూ ఇలాంటి కేసులోనే తాను అరెస్ట్ అయినట్టు గెహనా కోర్టుకు తెలిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు గెహనా ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది.
Raj Kundra : నా అనుమతి లేకుండా…అశ్లీల చిత్రాలు రిలీజ్ చేశాడు, రాజ్ కుంద్రాపై మరో నటి ఫిర్యాదు ?

ఫిబ్రవరిలో ఇదే కేసులో తనను అరెస్టు చేశారని, జూన్‌లో బెయిల్ మంజూరు చేసినట్లు ఆమె కోర్టుకు తెలిపింది. తనకు సంబంధించిన లాప్‌ట్యాప్‌, ఫోన్‌లను క్రైమ్‌ బ్రాంచ్‌ సీజ్‌ చేసిందని గెహనా పేర్కొంది. గత ఫిబ్రవరి నెలలో మొదటి సారిగా పోర్నోగ్రఫీ కేసులో గెహనాను ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత గెహనా బెయిల్‌పై విడుదల అయింది . రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో గెహనాపై మరోసారి కేసు నమోదైంది.

ఇటీవలే.. పోర్నోగ్రఫీ కేసులో నటి గెహనా వశిష్ట్ ఇన్వాల్వ్ అయిందంటూ మల్వానీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా ఆరోపణలతో కొద్ది రోజులుగా లీగల్ ఫైట్ చేస్తూ ఉన్నారు. గెహనా మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా లైవ్ లో న్యూ వీడియో ఒకటి పోస్టు చేసి దీనిని కూడా పోర్న్ అంటారా అని నెటిజన్లను ప్రశ్నించారు.
Gehana Vasisth: లైవ్ లో న్యూడ్ సెషన్ చేసిన గెహనా.. ‘దీన్ని పోర్న్ అంటారా’

లైవ్ సెషన్ లోకి వచ్చి అందరినీ విష్ చేశారు. వెంటనే తాను వల్గర్ ఉన్నానా అని అడుగుతూ.. చీప్ గా ఉన్నానా.. దీనిని కూడా పోర్న్ అంటారా.. తాను చేస్తున్న పని ఏదైనా పోర్న్ కేటగిరీలోకి వస్తుందా అని ప్రశ్నించారు. తానేం దుస్తులు వేసుకోలేదని ఇలా ఉండటాన్ని పోర్న్ అంటారేమో చెప్పాలని అడిగింది.