Agent : ఇక వెనక్కి తగ్గేదే లేదంటున్న ”ఏజెంట్” అఖిల్..

అక్కినేని అఖిల్ (Akhil Akkineni) పుట్టినరోజు సందర్భంగా ఏజెంట్ (Agent) మూవీ నుంచి కొత్త కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్ తోనే రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇచ్చారు.

Agent : ఇక వెనక్కి తగ్గేదే లేదంటున్న ”ఏజెంట్” అఖిల్..

Akhil Akkineni gave clarity on Agent release date

Updated On : April 7, 2023 / 2:26 PM IST

Agent : అక్కినేని అఖిల్ (Akhil Akkineni) నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఏజెంట్ (Agent). స్టైలిష్ డైరెక్టర్ సురేంద్ర రెడ్డి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ అనౌన్స్ చేసి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతున్నా, అనేక కారణాలు వల్ల రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇటీవల ఈ చిత్రాన్ని వేసవి సెలవుల్లో ఏప్రిల్ 28న ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తామంటూ ప్రకటించారు. కానీ రిలీజ్ దగ్గర పడుతున్నా ఇప్పటి వరకు ప్రమోషన్స్ మొదలు పెట్టకపోవడంతో ఏజెంట్ మళ్ళీ వాయిదా పడింది అంటూ వార్తలు వినిపించాయి. తాజాగా ఈ మూవీ నుంచి చిత్ర యూనిట్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు.

Nagarjuna : టాలెంట్ ఉందా.. అయితే నాగార్జునకి వాట్సాప్ చేయండి..

రేపు అఖిల్ పుట్టిన రోజు కావడంతో బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఏజెంట్ టీం ఒక కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో అఖిల్ గన్ పట్టుకొని ఉంటే, తన వెనుక బ్లాస్ట్ జరిగిన దృశ్యం కనిపిస్తుంది. ఇక ఈ పోస్టర్ తోనే రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇచ్చారు. ముందు చెప్పిన డేట్ ఏప్రిల్ 28కే ఏజెంట్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కాగా రేపు ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ గాని ట్రైలర్ గాని రిలీజ్ చేస్తే బాగుండని అక్కినేని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. మరి మేకర్స్ ఏమన్నా అప్డేట్ ఇస్తారా? లేదా ఈ పోస్టర్ తో సరిపెట్టేస్తారా? అనేది చూడాలి.

ఇక ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. సాక్షి వైద్య, అఖిల్ కి జంటగా కనిపించబోతుంది. వక్కంతం వంశీ ఈ సినిమాకి కథని అందిస్తున్నాడు. ఈ మూవీ కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. ఈ సినిమాతో కోరుకున్న మాస్ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకుందాం అని ట్రై చేస్తున్నాడు. మరి అఖిల్ కలలను ఏజెంట్ ఎంతవరకు నెరవేరుస్తుందో చూడాలి. AK ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగుతో పాటు మొత్తం 5 భాషల్లో పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా విడుదల కాబోతుంది. హిప్ హాప్ తమిజా ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు.