Akkineni Amala : శర్వానంద్ నా మూడో కొడుకు.. పదేళ్ల తర్వాత మళ్ళీ సినిమా చేస్తున్నా..

తాజాగా ఒకేఒక జీవితం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో అక్కినేని అమల మాట్లాడుతూ.. ''పదేళ్ళ తర్వాత మళ్ళీ సినిమా చేస్తున్నాను. దర్శకుడు.................

Akkineni Amala : శర్వానంద్ నా మూడో కొడుకు.. పదేళ్ల తర్వాత మళ్ళీ సినిమా చేస్తున్నా..

Akkineni Amala speech in Okeoka Jeevitham Trailer Launch Event

Updated On : September 4, 2022 / 9:49 AM IST

Akkineni Amala :  శర్వానంద్, రీతూ వర్మ జంటగా అమల ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ఒకేఒక జీవితం. కొత్త దర్శకుడు శ్రీ కార్తీక్ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్ లో ఈ సినిమా ఒకేసారి తెలుగు, తమిళ్ లో తెరకెక్కింది. సెప్టెంబర్ 9న ఒకేఒక జీవితం సినిమా థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఇందులో అమల శర్వా తల్లి పాత్ర పోషించింది. దాదాపు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అమల వెండితెరపై కనిపించనుంది.

Okeoka Jeevitham Trailer Launch Event : ఒకేఒక జీవితం ట్రైలర్ లాంచ్ గ్యాలరీ

తాజాగా ఒకేఒక జీవితం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో అక్కినేని అమల మాట్లాడుతూ.. ”పదేళ్ళ తర్వాత మళ్ళీ సినిమా చేస్తున్నాను. దర్శకుడు మంచి కథని తీసుకొచ్చి నాకు అందులో క్యారెక్టర్ ఇచ్చారు. సినిమాని చాలా గ్రాండ్ గా తెరకెక్కించారు. ఈ సినిమాలో శర్వానంద్ కి తల్లిగా చేశాను. ఇప్పుడు శర్వా నా మూడో కొడుకయ్యాడు. ఈ సినిమాలో తల్లిప్రేమ గురించి ఉంటుంది కానీ సినిమా మొత్తం అదే ఉండదు. ఈ సినిమా ఓ ముగ్గురి జర్నీ, కాలంతో ఆడుకుంటూ దాన్ని కరెక్ట్ చేయాలనుకున్నా విధి మాత్రం మారదు. సినిమా చాలా స్పెషల్ గా ఉంటుంది. కచ్చితంగా థియేటర్ కి వెళ్లి చూడండి” అని మాట్లాడారు.