దేశంలో బెస్ట్ సీఎంగా జగన్ నిలుస్తారు.. అలీ..

  • Published By: sekhar ,Published On : September 16, 2020 / 07:57 PM IST
దేశంలో బెస్ట్ సీఎంగా జగన్ నిలుస్తారు.. అలీ..

Updated On : September 16, 2020 / 8:22 PM IST

Ali Met AP CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దేశంలోనే ఉత్తమ సీఎం అని సినీ నటుడు అలీ ప్రశంసించారు. తాడేపల్లిలో ఏపీ సీఎంను బుధవారం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.


భేటీ ముగిసిన అనంతరం అలీ మీడియాతో మాట్లాడుతూ.. ‘మా నాయకుడిని మర్యాద పూర్వకంగా కలిశాను. సినీ పరిశ్రమకు సంబంధించిన వివరాలు అడిగారు. షూటింగ్స్ మొదలు కావడానికి ఇంకా సమయం పడుతుందని చెప్పాను. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ సీఎం నెరవేరుస్తున్నారు. ఈయనకి మంచి పేరు వస్తుందన్న అక్కసుతోనే కొందరు విమర్శలు చేస్తున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా దేశంలో బెస్ట్ సీఎంగా జగన్ నిలుస్తారు’ అని అలీ అన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన అలీ రాష్ట్రమంతా పర్యటించి పార్టీ తరపున విస్తృత ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.