Amitabh Bachchan : అమితాబ్ బచ్చన్ అయోధ్యలో ప్లాటు కొన్నారు

బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ అయోధ్య పట్టణంలో 7 నక్షత్రాల ఎన్‌క్లేవ్ అయిన సరయూలో ఒక ప్లాట్‌ను కొన్నారు. ముంబయికి చెందిన డెవలపర్ హోమ్ ఆఫ్ అభినందన్ లోధ నుంచి అమితాబ్ ప్లాట్ కొన్నారు.....

Amitabh Bachchan : అమితాబ్ బచ్చన్ అయోధ్యలో ప్లాటు కొన్నారు

Amitabh Bachchan

Amitabh Bachchan : బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ అయోధ్య పట్టణంలో 7 నక్షత్రాల ఎన్‌క్లేవ్ అయిన సరయూలో ఒక ప్లాట్‌ను కొన్నారు. ముంబయికి చెందిన డెవలపర్ హోమ్ ఆఫ్ అభినందన్ లోధ నుంచి అమితాబ్ ప్లాట్ కొన్నారు. 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిని నిర్మించాలని ఆయన భావిస్తున్నారు. ఈ ఇంటి విలువ రూ.14.5 కోట్లు. అయోధ్యలోని సరయూ నదీ సమీపంలో నిర్మించిన శ్రీరామ ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 22వతేదీన ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అమితాబ్ అయోధ్యలో ఇంటిని కొనుగోలు చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

ALSO READ : Prime Minister Narendra Modi : పీఎంఏవై జి స్కీం లబ్ధిదారులకు ప్రధాని మోదీ శుభవార్త

‘‘పవిత్ర రామజన్మభూమి అయిన అయోధ్యకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. అయోధ్య పట్టణం ఆధ్యాత్మికత, సాంస్కృతిక గొప్పతనాన్ని ఏర్పరచుకుంది. గ్లోబల్ ఆధ్యాత్మిక రాజధాని అయిన అయోధ్యలో నేను ఇల్లు నిర్మించటానికి ఎదురు చూస్తున్నాను’’ అని అమితాబ్ వ్యాఖ్యానించారు. అమితాబ్ జన్మస్థలం అలహాబాద్. అయోధ్య నుంచి జాతీయ రహదారిపై 330 కిలోమీటర్ల దూరం ఉంది. రామాలయానికి 15 నిమిషాల ప్రయాణ దూరంలో సరయూ నదీ తీరం వద్ద తమ సంస్థ నిర్మిస్తున్న అయోధ్య ప్రాజెక్టులో అమితాబ్ ను మొదటి పౌరుడిగా స్వాగతిస్తున్నానని హూబ్ల్ ఛైర్మన్ అభినంది లోధ చెప్పారు.

ALSO READ : Prashanth Varma : ఇక నుంచి ప్రతి సంక్రాంతికి ఓ సూపర్ హీరో సినిమా.. హనుమాన్ డైరెక్టర్ ఆసక్తికర ప్రకటన..

తమ అయోధ్య ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టడం వారి ఆధ్యాత్మిక వారసత్వ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని లోధ పేర్కొన్నారు. అమితాబ్ పెట్టుబడి పెట్టిన ఎన్ క్లేవ్ బ్రూక్ఫీల్డ్ గ్రూప్-యాజమాన్యంలోని లీలా ప్యాలెస్,రిసార్ట్స్ భాగస్వామ్యంతో ఫైవ్-స్టార్ ప్యాలెస్ హోటల్ కూడా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ మార్చి 2028 నాటికి పూర్తి కానుంది. రామాలయం నిర్మాణంతో అయోధ్యలో భారీగా మౌలిక సదుపాయాలు కల్పించారు. దీంతో లక్నో, గోరఖ్ పూర్ నగర శివార్లలోనూ భూముల ధరలు పెరిగాయి.

ALSO READ : Milind Deora : లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు బిగ్ షాక్

అయోధ్యలో మూడేళ్లలో భూముల ధరలు 30 శాతం పెరిగాయి. తమ ప్రాజెక్టుకు 19 దేశాల ప్రజల నుంచి ఆదరణ లభించిందని మహారాష్ట్ర పర్యాటక మంత్రి మంగల్ ప్రభుత్ లోధ చెప్పారు. హోబ్ల్ బెనారెస్, బృందావన్, సిమ్లా, అమృత్ సర్ నగరాల్లో మరో నాలుగు లగ్జరీ హోటళ్లను రూ.2వేల కోట్లతో నిర్మించనున్నట్లు మంగల్ ప్రభుత్ లోధ వివరించారు.