Anjali : వామ్మో.. పుట్టిన రోజున మాస్ లుక్స్ తో భయపెడుతున్న అంజలి..
‘బహిష్కరణ’ సిరీస్ లో అంజలి మెయిన్ లీడ్ చేస్తుంది.
![Anjali : వామ్మో.. పుట్టిన రోజున మాస్ లుక్స్ తో భయపెడుతున్న అంజలి.. Anjali : వామ్మో.. పుట్టిన రోజున మాస్ లుక్స్ తో భయపెడుతున్న అంజలి..](https://diey8xpfs90ha.cloudfront.net/wp-content/uploads/2024/06/anjali.jpg)
Anjali coming soon with Bahishkarana Web Series in Zee5 OTT Motion Poster Released
Anjali : యాబైకి పైగా సినిమాల్లో నటించిన అంజలి ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఓ మాస్ పాత్రలో మెప్పించింది. త్వరలో ఓ వెబ్ సిరీస్ తో రాబోతుంది. ZEE 5, ఫిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై ప్రశాంతి మలిశెట్టి నిర్మాణంలో ముఖేష్ ప్రజాపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. ఈ సిరీస్ లో అంజలి మెయిన్ లీడ్ చేస్తుంది.
Also Read : Fathers Day 2024 : ఫాదర్స్ డే స్పెషల్.. నాన్నకు విష్ చేస్తూ మన సెలబ్రిటీల పోస్టులు..
విలేజ్ రివేంజ్ డ్రామా జానర్లో తెరకెక్కుతున్న ఈ బహిష్కరణ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉండనున్నాయి. తాజాగా నేడు అంజలి పుట్టిన రోజు సందర్భంగా ‘బహిష్కరణ’ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్లో.. అంజలి వేట కొడవలి పట్టుకుని కోపంగా చూస్తూ కూర్చుంది. పక్కనే ఓ చెక్క కుర్చీ మంటల్లో కాలిపోతుంది. దీంతో మరోసారి అంజలి ఓ మాస్ పాత్రలో అలరించబోతుందని తెలుస్తుంది.
Happy Birthday @yoursanjali
We cannot wait for the world to see your new avatar from #Bahishkarana#BahishkaranaOnZee5 Coming Soon!@PixelPicturesIN @Prashmalisetti @iamprajapathi @prasannadop@SidharthSadasi1 pic.twitter.com/YW4Stiidvy
— ZEE5 Telugu (@ZEE5Telugu) June 16, 2024
ఇక ఈ ‘బహిష్కరణ’ వెబ్ సిరీస్‌లో రవీంద్ర విజయ్, శ్రీతేజ్, అనన్య నాగళ్ల, షణ్ముక్, చైతన్య సాగిరాజు, మహ్మద్ బాషా, బేబీ చైత్ర.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సిరీస్ ZEE 5 ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.