Anushka Shetty: అనుష్క శెట్టి కొత్త సినిమా డిజిటల్ రైట్స్ ఆ ఓటీటీకేనా..?

టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి చాలా గ్యాప్ తరువాత ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను జీ5 భారీ రేటుకు సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

Anushka Shetty: అనుష్క శెట్టి కొత్త సినిమా డిజిటల్ రైట్స్ ఆ ఓటీటీకేనా..?

Anushka Shetty Starrer Miss Shetty Mr Polishetty Digital Rights Acquired By Zee5

Updated On : April 9, 2023 / 8:49 PM IST

Anushka Shetty: టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి చాలా గ్యాప్ తరువాత ఇప్పుడు ఓ సినిమాలో నటిస్తోంది. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి సరసన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ అనే సినిమాలో అనుష్క నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె ఓ చెఫ్ పాత్రలో కనిపిస్తోంది. ఇప్పటికే ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కింది.

Anushka Shetty: ఉగాది రోజున అనుష్క కూడా ట్రీట్ ఇస్తోందిగా.. ఏమిటో తెలుసా?

ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను ఇటీవల రిలీజ్ చేయగా, దానికి కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. కాగా, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త ఫిలిం సర్కిల్స్‌లో జోరుగా చక్కర్లు కొడుతోంది. పూర్తి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5 సొంతం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Anushka Shetty: జాతిరత్నం కోసం చెఫ్‌గా మారిన స్వీటీ..!

ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను జీ5 భారీ రేటుకు సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ కానీ, జీ5 కానీ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. దీంతో ఈ సినిమా డిజిటల్ రైట్స్ నిజంగానే అమ్ముడయ్యాయా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇక ఈ సినిమాను పి.మహేష్ బాబు డైరెక్ట్ చేస్తుండగా, యువీ క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.