‘పోలవరం’లో అనుష్క పూజలు.. బోటులో ప్రయాణం!

  • Published By: vamsi ,Published On : December 10, 2020 / 11:03 AM IST
‘పోలవరం’లో అనుష్క పూజలు.. బోటులో ప్రయాణం!

Updated On : December 10, 2020 / 11:23 AM IST

Anushka Shetty:దక్షిణాది స్టార్ హీరోయిన్‌, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పిస్తున్న అనుష్క పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంకు వచ్చారు. మహా నందీశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించేందుకు ఆమె అక్కడకి విచ్చేశారు. ‘బాహుబలి’ చిత్రానికి కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పని చేసిన ప్రశాంతి త్రిపురనేని, మరో స్నేహితురాలుతో కలిసి ఆమె పోలవరంకు వచ్చారు.



ఈ సంధర్భంగా అనుష్క బోటులో ప్రయాణించారు. ఆమె ముఖానికి మాస్కు ఉండటం వల్ల స్థానికులు వెంటనే గుర్తుపట్టలేదు. అక్కడ తీసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండగా.. ఆడంబరం లేకుండా ఆమె వచ్చిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అనుష్క తన స్వస్థలం మంగళూరు నుంచి పురుషోత్తపట్నం వచ్చినట్టు తెలుస్తోంది. అనుష్క అంతకుముందు కూడా దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తూ కనిపించిన సంగతి తెలిసిందే



కార్తీక మాసంలో గోదావరి మధ్యలోని మహానందీశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకోవడాన్ని మంచిదిగా భావిస్తారు. పూజాధికాలు ముగిసిన తర్వాత తిరిగి అదే బోటులో ఆమె తిరిగివెళ్లారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.