AP High Court : థియేటర్లని మూసే హక్కు MROకి లేదు.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు..
ఇటీవల గత కొన్ని రోజుల క్రితం ఏపీలో థియేటర్స్ పై రైడ్స్ నిర్వహించి కొన్ని థియేటర్స్ మూసివేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఇది సంచలనంగా మారింది. దీనిపై.........

Ap High Court
Movie Theaters : ఇటీవల గత కొన్ని రోజుల క్రితం ఏపీలో థియేటర్స్ పై రైడ్స్ నిర్వహించి కొన్ని థియేటర్స్ మూసివేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఇది సంచలనంగా మారింది. దీనిపై చాలా మంది థియేటర్స్ ఓనర్స్ వ్యతిరేకత వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం సరైన వసతులు లేవని, రిజిస్ట్రేషన్ గడువు అయిపొయింది అని క్లోజ్ చేశామంటూ కారణాలు తెలిపింది. ఆ తర్వాత వసతులు మెరుగు పరిచి, రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేసుకుంటే తెరుచుకోవచ్చు అని కూడా తెలిపింది.
అయితే శ్రీకాకుళం జిల్లా సోంపేటలోని ఓ థియేటర్ ను కూడా ఇలాగే క్లోజ్ చేశారు. తన థియేటర్ ని MRO క్లోజ్ చేయించాడని థియేటర్ ఓనర్ ఏపీ హైకోర్టుని ఆశ్రయించాడు. ఇది వాదనలోకి రాగా వాదనల్లో టెక్కలి సబ్ కలెక్టర్ ఆదేశాలతోనే థియేటర్ సీజ్ చేశామని ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించారు. థియేటర్ ఓనర్ మాత్రం MRO నే క్లోజ్ చేసాడట అంటూ సాక్షాలు చూపెట్టాడు.
Sreeleela : త్రివిక్రమ్, మహేష్ సినిమాలో ‘పెళ్లి సందD’ హీరోయిన్??
దీంతో ఏపీ ప్రభుత్వ న్యాయవాది వాదనని కోర్టు తప్పుబట్టింది. థియేటర్ ను ఎమ్మార్వో సీజ్ చేసే అధికారాలు లేవని అది సబ్ కలెక్టర్ పరిధిలోని అంశమని స్పష్టం చేస్తూ మూసిన థియేటర్ ను తక్షణమే తెరిపించాలని ఆదేశాలు జారీ చేస్తూ తీర్పునిచ్చింది. దీంతో ఏపీ హైకోర్టులో మరోసారి ప్రభుత్వానికి చుక్కెదురైంది.