బాలయ్య బంగారం.. ఆపదంటే ముందుంటాడు..

నటసింహ నందమూరి బాలకృష్ణ మరోమారు మంచి మనసు చాటుకున్నారు.బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో కోవిడ్-19 సందర్భంగా ఇబ్బందులు పడుతున్న హౌస్ కీపింగ్ ఉద్యోగస్తులు, సెక్యూరిటీ సిబ్బందితో పాటు, హాస్పిటల్ విధులలో ఉన్న దివ్యాంగులకు నందమూరి బాలకృష్ణ నిత్యావసర వస్తువులను అందజేశారు.

బాలయ్య బంగారం.. ఆపదంటే ముందుంటాడు..

నటసింహ నందమూరి బాలకృష్ణ మరోమారు మంచి మనసు చాటుకున్నారు.బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో కోవిడ్-19 సందర్భంగా ఇబ్బందులు పడుతున్న హౌస్ కీపింగ్ ఉద్యోగస్తులు, సెక్యూరిటీ సిబ్బందితో పాటు, హాస్పిటల్ విధులలో ఉన్న దివ్యాంగులకు నందమూరి బాలకృష్ణ నిత్యావసర వస్తువులను అందజేశారు. సంస్థలో విధులు నిర్వహిస్తున్న వారందరూ అందిస్తున్న సేవలకు ప్రోత్సాహకంగా వాటిని అందజేస్తున్నట్లు బాలయ్య తెలిపారు.

nbk1
హౌస్ కీపింగ్ ఉద్యోగస్తులు, సెక్యూరిటీ సిబ్బందితో పాటు, హాస్పిటల్ విధులలో ఉన్న దివ్యాంగులకు మాత్రమే కాకుండా సంస్థ ఆవరణలోని హాస్టల్‌లో ఉంటున్న మెడికల్, పారా మెడికల్ సిబ్బందికి కూడా నిత్యావసర వస్తువులతో పాటు ప్రతి రోజూ భోజన సదుపాయాన్ని ఈ సంస్థ ఏర్పాటు చేసింది. వీళ్లంతా లాక్‌డౌన్ కారణంగా తమతమ ఇళ్లకు దూరంగా ఉంటూ పేషెంట్లకు వివిధ రకములైన సేవలను అందిస్తున్నారు. అలాగే ఎన్నో కష్టాలు పడి ఎంతో దూరం నుంచి హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం వస్తున్న రోగులకు ప్రతిరోజూ ఉచిత భోజన సదుపాయాన్ని కూడా సంస్థ పలువురు దాతల సహకారంతో ఏర్పాటు చేసింది. ఈ ఉచిత భోజన కార్యక్రమం కోవిడ్-19 సమస్య ముగిసేంత వరకూ కొనసాగిస్తామని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ సభ్యులు తెలిపారు.

pressnote