పదహారేళ్లకే పవర్ చూపిస్తున్న పవన్ కొడుకు.. పాతికొస్తే కష్టమేనంటున్న బండ్ల..

పవన్ కళ్యాణ్ తనయుడు అకీరాపై ఆసక్తికర ట్వీట్ చేసిన బండ్ల గణేష్..

  • Published By: sekhar ,Published On : April 10, 2020 / 10:29 AM IST
పదహారేళ్లకే పవర్ చూపిస్తున్న పవన్ కొడుకు.. పాతికొస్తే కష్టమేనంటున్న బండ్ల..

Updated On : April 10, 2020 / 10:29 AM IST

పవన్ కళ్యాణ్ తనయుడు అకీరాపై ఆసక్తికర ట్వీట్ చేసిన బండ్ల గణేష్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని.. నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. పవన్ తనయుడు అకిరా నందన్ పుట్టిరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏప్రిల్ 8 అకిరా బర్త్ డేను పురస్కరించుకుని మెగా ఫ్యామిలీ, ఫ్యాన్స్ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. 

‘మన బిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం. నా చేతిలో ఒదిగిపోయిన ఈ బిడ్డ, ఎత్తులో అందరికంటే ఎదిగిపోయాడు(6’4). అన్ని విషయాల్లోనూ అందరిని ఇలానే  మించిపోవాలి. విష్ యూ ఏ ‘పవర్’ఫుల్ ఫ్యూచర్. హ్యాపీ బర్త్‌డే అకీరా’ అంటూ అకీరాను ఎత్తుకున్న ఫోటోను చిరంజీవి షేర్ చేశారు.

Read Also : మామూలోడివి కాదు స్వామీ.. మున్సిపల్‌ కార్మికులకు అక్షయ్ భారీ విరాళం..

‘నన్ను తలెత్తుకునేలా చేసాడు’ (అకిరా హైట్‌ని ఉద్దేసిస్తూ) వరుణ్ తేజ్ ట్వీట్ చేయగా.. బండ్ల గణేష్.. ‘పదహారేళ్లకే పవర్ చూపిస్తున్నాం.. పాతికేళ్లు వస్తే ఎట్టా ఉంటదబ్బా.. కొణిదెల అకీరా రారారా రారారా’ అంటూ పవర్ ఫుల్ ట్వీట్ చేసాడు. ఇక అకీరా బర్త్ డే విషెస్ హ్యాష్ ట్యాగ్ ఎంతలా ట్రెండ్ అయిందంటే.. 24 గంటల్లో అకీరాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన హ్యాష్ ట్యాగ్‌తో వేసిన ట్వీట్స్ సంఖ్య అక్షరాల 1.1మిలియన్(11లక్షలు).. దాదాపు 158.8 మిలియన్ మందికి రీచ్ అయినట్లు సమాచారం.