Bandla Ganesh vs Trivikram : చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ ఖర్మం గురూజీ.. బండ్ల గణేష్ ట్వీట్!
నిన్న త్రివిక్రమ్ పై ఆరోపణలు చేస్తూ ట్వీట్స్ వేసిన బండ్ల గణేష్.. నేడు మరో రెండు ట్వీట్స్ చేశాడు. సాగినంత కాలం నా అంత వాడు లేడందురు..

Bandla Ganesh again two tweets on Trivikram about pawan kalyan friendship
Bandla Ganesh vs Trivikram : గత కొంత కాలంగా టాలీవుడ్ నటుడు మరియు నిర్మాత బండ్ల గణేష్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పై ఆరోపణలు చేస్తూ వస్తున్నాడు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నుంచి తనని త్రివిక్రమ్ దూరం చేస్తున్నాడని, పవన్ సినిమా ఈవెంట్స్ కి కూడా త్రివిక్రమ్ తనని రానివ్వడం లేదని.. బండ్ల గణేష్ ఇండైరెక్ట్ గా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇక నిన్న (మే 26) కొంచెం డైరెక్ట్ గానే త్రివిక్రమ్ పై ఆరోపణలు చేశాడు. త్రివిక్రమ్ ని గురిజి అని పిలుస్తారని అందరికి తెలిసిందే. ఈ పేరుతోనే బండ్ల గణేష్ ట్వీట్స్ వేస్తున్నాడు.
Chiranjeevi – Pawan Kalyan : దర్శకుడు వాసు మరణం పై చిరు, పవన్ సంతాపం..
”గురూజీని కలిసి కాస్ట్‌లీ గిఫ్ట్ ఇస్తే ఏదైనా జరిగిపోతుందని” అని ఒక ట్వీట్ చేయగా, మరో ట్వీట్ లో.. ”భార్యాభర్తల్ని, తండ్రి కొడుకుల్ని, గురుశిష్యుల్ని, ఎవర్నైనా వేరు చేయడంలో గురూజీ స్పెషాలిటీ” అని చెప్పుకొచ్చాడు. తాజాగా నేడు మరో రెండు ట్వీట్స్ వేశాడు. “సాగినంత కాలం నా అంత వాడు లేడందురు. సాగకపోతే ఊరక చతికిల పడిపోవదురు. చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ ఖర్మం గురూజీ” అంటూ ట్వీట్ చేశాడు. మరో ట్వీట్ లో.. “భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి. భగవంతుడికి భక్తుడిని దూరం చేసేది గురూజీ దర్బార్ సుత్తి” అని చెప్పుకొచ్చాడు.
Pawan – Charan : 15 ఏళ్ళ బ్యాడ్ సెంటిమెంట్‌ని బ్రేక్ చేసి బాబాయ్ అబ్బాయి గేమ్ చెంజర్స్ అవుతారా?
ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ట్వీట్స్ పై కొందరు అభిమానులు సీరియస్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ తో గురూజీకి ఎటువంటి సాన్నిహిత్యం ఉందో, నీకు అలానే ఉంది. ఆ సాన్నిహిత్యాన్ని ఇలాంటి అనవసరమైన ట్వీట్స్ చేసి పోగొట్టుకోకండి అంటూ సలహాలు ఇస్తున్నారు. మరి బండ్ల గణేష్ ఈ ట్వీట్స్ ని ఇలానే కొనసాగిస్తాడు? లేదా? అనేది చూడాలి.
సాగినంత కాలం నా అంత వాడు లేడందురు
సాగకపోతే ఊరక చతికిల పడిపోవదురు
చెప్పడమే నా ధర్మం..వినకపోతే నీ ఖర్మం
… గురూజీ ?
— BANDLA GANESH. (@ganeshbandla) May 27, 2023
భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి
భగవంతుడికి భక్తుడిని దూరం చేసేది గురూజీ దర్బార్ సుత్తి ?
— BANDLA GANESH. (@ganeshbandla) May 27, 2023