Bandla Ganesh : మొన్నటిదాకా పవన్ పై.. ఇప్పుడు చంద్రబాబుపై.. ఆవేశంగా ఏడుస్తూ బండ్లగణేష్ స్పీచ్..
బండ్ల గణేష్ స్టేజిపై పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినట్టే.. చంద్రబాబు గురించి కూడా ఆవేశంగా అరుస్తూ ఎమోషనల్ అయి మాట్లాడారు. దీంతో బండ్ల గణేష్ స్పీచ్ వైరల్ గా మారింది.

Bandla Ganesh Sensational Comments on Chandrababu Naidu Video Goes Viral
Bandla Ganesh : నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సినిమాల్లో నటించిన దానికన్నా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పై స్పీచ్ లతో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. సినిమా ఈవెంట్స్ లో పవన్ నా దేవుడు అంటూ గతంలో బండ్ల గణేష్ ఇచ్చిన స్పీచ్ లు బాగా వైరల్ అయ్యాయి. ఇక బండ్ల గణేష్ రాజకీయాల్లో కూడా ఉన్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ గా తన సోషల్ మీడియాలో తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై స్పందిస్తూ ఉంటాడు.
ఇటీవల ఏపీలో చంద్రబాబు(Chandrababu Arrest) అరెస్ట్ పై కూడా స్పందిస్తూ విమర్శలు చేశాడు బండ్ల గణేష్. తాజాగా హైదరాబాద్ సైబర్ టవర్స్ నిర్మించి 25 ఏళ్ళు పూర్తయినందుకు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు నిన్న ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో చంద్రబాబుకి థ్యాంక్స్ చెప్తూ ఓ స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి పలువురు సినీ ప్రముఖులు కూడా వచ్చారు. ఈ ఈవెంట్ కి వచ్చిన బండ్ల గణేష్ స్టేజిపై పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినట్టే.. చంద్రబాబు గురించి కూడా ఆవేశంగా అరుస్తూ ఎమోషనల్ అయి మాట్లాడారు. దీంతో బండ్ల గణేష్ స్పీచ్ వైరల్ గా మారింది.
బండ్ల గణేష్ తన స్పీచ్ లో.. చంద్రబాబుని ఏ తప్పు చేయకుండా ఎందుకు అరెస్ట్ చేశారు? సైబర్ టవర్స్ కట్టినందుకు, హైదరాబాద్ కి సాఫ్ట్ వేర్ తెచ్చినందుకు 400 ఏళ్ళు అయినా చంద్రబాబుని గుర్తుంచుకుంటారు. దేవుడు శ్రీకృష్ణుడే జైలులో పుట్టాడు. చంద్రబాబు దేవుడు. ఎక్కడికి వెళ్లినా, ఏ దేశం వెళ్లినా చంద్రబాబు జై అని అంటున్నారు. కానీ చంద్రబాబుని రాజమండ్రి జైలులో చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. మనందరికీ భవిష్యత్తు ఇచ్చినందుకు ఆయన జైల్లో ఉండాలా? చంద్రబాబు తెలుగు వాడిగా పుట్టడం నేరమా? ఇన్ని మంచి పనులు చేస్తే వేరే రాష్ట్రాల్లో అయితే చంద్రబాబుని ఆకాశంలో పెట్టుకొని చూసేవారు. ఆయన సేవలను ఎవ్వరూ, ఎప్పటికి మర్చిపోరు. కేంద్ర నాయకులు, అప్పటి ప్రధానమంత్రి వాజ్ పేయ్ స్వయంగా చంద్రబాబు గ్రేట్ అని పొగిడారు అంటూ చంద్రబాబు గురించి ఆవేశంగా మాట్లాడారు. మధ్యలో ఎమోషనల్ అయ్యారు బండ్ల గణేష్.