Bigg Boss 7 Day 97 : కంటెస్టెంట్స్ పై ఫైర్ అయిన నాగార్జున.. ఒక్కొక్కరికి ఇచ్చి పడేశాడుగా..

ఎప్పటిలాగే వారం రోజులు కంటెస్టెంట్స్ చేసిన తప్పులు అన్ని ఎత్తి చూపిస్తూ ఫైర్ అయ్యాడు నాగార్జున.

Bigg Boss 7 Day 97 : కంటెస్టెంట్స్ పై ఫైర్ అయిన నాగార్జున.. ఒక్కొక్కరికి ఇచ్చి పడేశాడుగా..

Bigg Boss 7 Day 97 Highlights Nagarjuna Serious on Contestants in Weekend Episode

Updated On : December 10, 2023 / 7:24 AM IST

Bigg Boss 7 Day 97 : బిగ్‌బాస్ 14వ వారం సాగుతుంది. నిన్న శనివారం వీకెండ్ ఎపిసోడ్ కావడంతో నాగార్జున వచ్చాడు. ఎప్పటిలాగే వారం రోజులు కంటెస్టెంట్స్ చేసిన తప్పులు అన్ని ఎత్తి చూపిస్తూ ఫైర్ అయ్యాడు నాగార్జున. ఇప్పటికే అర్జున్ బిగ్‌బాస్ ఫినాలేకి చేరుకున్నాడు. అర్జున్ ని ఏమి అనలేదు. ప్రియాంకని కూడా ఎక్కువగా ఏమి అనకుండా మెచ్చుకున్నాడు. ప్రియాంక కూడా ఫినాలేకి వెళ్తుందని భావిస్తున్నారు ప్రేక్షకులు.

ఈ వారం ఆల్మోస్ట్ అందరితో కన్ఫెషన్ రూమ్ కి పిలిచి పర్సనల్ గా మాట్లాడాడు నాగార్జున. మొదట శోభాశెట్టి మార్బుల్ పగలకొట్టి కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచినాడు నాగ్. దీంతో ఆమె శివాజీతో గొడవ గురించి చెప్పి తెలుగమ్మాయి కాదు అని పదేపదే అంటున్నాడు అంటూ అతనిమీద కంప్లైంట్ చేసింది. వెళ్ళిపోతానేమో అని భయంగా ఉంది అంటూ ఎమోషనల్ అయింది. అయితే నాగ్ ఓ పక్క ఓదారుస్తూనే ఆమె చేసిన తప్పులని గుర్తుచేసి. నువ్వు అందర్నీ డిస్టర్బ్ చేస్తున్నావు, హౌస్ లో వాతావరణం కలుషితం చేస్తున్నావు అంటూ సీరియస్ అయ్యాడు.

శోభా తర్వాత యావర్ ని హౌస్ లోకి పిలిచాడు నాగ్. శోభాని తిట్టడంపై సీరియస్ అయ్యాడు. నీ ప్రవర్తన బాగోలేదు అని, వరస్ట్ బిహేవియర్ అని యావర్ పై ఫైర్ అయ్యాడు నాగ్. అయితే యావర్ తన తప్పు లేదని సమర్ధించుకోవడానికి ట్రై చేయడంతో ఇదే నీ నిజ స్వరూపం, బయటకి వెళ్ళాక శోభాకి సారీ చెప్పు అని చెప్పినా యావర్ తప్పు చేయలేదని మాట్లాడటంతో నీకు చెప్పలేను నేను అని పంపించేశాడు నాగ్.

అనంతరం ప్రశాంత్ ని పిలిచి.. నువ్వు బాగా యాక్టింగ్ చేస్తావని తాను చేసిన తప్పులని ప్రస్తావిస్తూ ఫైర్ అయ్యాడు నాగ్. ప్రశాంత్ మాట్లాడితే వీడియోలు చూపించు.. నేను అలా చేయలేదు, అలా అనలేదు అని మాట్లాడినవి అన్ని గుర్తుచేస్తూ.. నువ్వు అడగ్గానే బిగ్ బాస్ నీకు వీడియోలు చూపించాలా? ఇప్పుడు కూడా ఏమైనా వీడియోలు చూపించాలా అని ఫైర్ అయ్యారు నాగ్. అలాగే అమర్ కొరక్కుండానే కొరికాడని, రక్తం వచ్చిందని, గాట్లు పడ్డాయని అబద్దాలు ఎందుకు చెప్పావు? కావాలని అమర్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అంటూ ప్రశాంత్ పై ఫైర్ అయ్యాడు నాగ్. నాగార్జున మాట్లాడుతుంటే ప్రశాంత్ తాను తప్పు చేయలేదు అని కవర్ చేయడానికి ప్రయత్నించడంతో చెప్పేది విను ముందు అని నాగ్ సీరియస్ అయ్యాడు.

ఇక చివరగా శివాజీని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచాడు నాగ్. ఇన్నాళ్లు శివాజీ గ్రూప్ కి కాస్తో కూస్తో సపోర్ట్ చేసిన నాగ్ ఈ ఎపిసోడ్ లో మాత్రం ఆ గ్రూప్ వాళ్ళందర్నీ కడిగేశాడు. ఇక శివాజీ ఈ వారం ఆడవాళ్ళ మీద అనరాని మాటలు అన్నాడు. ఆడవాళ్ళ పీక మీద కాలేసి తొక్కుతా, ఆడపిల్లలని పీకుతా అంటూ మాట్లాడటంతో అసలు ఇదేం పద్ధతి అని నాగ్ శివాజీ పై సీరియస్ అయ్యాడు. అయినా కూడా శివాజీ తన మాటలని సమర్ధించుకోవడం విశేషం. ఈ విషయంలో నాగ్ తో శివాజీ వాదించాడు.

Also Read : Bigg Boss 7 Day 95 : ఈ వీక్ నేనే ఎలిమినేట్ అయ్యేది.. వెళ్లేముందు శివాజీ గురించి బయటపెడతా.. శోభాశెట్టి

ఆ తర్వాత చివరగా అమర్ ని పిలిచాడు. అమర్ తో.. ఎందుకు పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేస్తున్నావు? అసలు కెప్టెన్ లా ప్రవర్తించావా, సైకోలా బిహేవ్ చేస్తున్నావు అని ఫైర్ అయ్యాడు నాగ్. బయట కూడా ఇదే అనుకుంటున్నారని చెప్పాడు. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ లో నాగ్ కంటెస్టెంట్స్ అందరిపై ఫైర్ అయ్యాడు. మరి నేటి ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.