Bigg Boss 8 : హౌస్ మేట్స్ కి దీపావళి ఎమోషనల్ సర్‌ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్..

Bigg Boss gave an emotional Diwali surprise to the housemates
Bigg Boss 8 : బిగ్ బాస్ సీజన్ 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత నుండి మరింత ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. లాస్ట్ వీక్ ఊహించని విధంగా మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది చూడాలి. అయితే నేడు బిగ్ బాస్ 8 ప్రోమో రిలీజ్ చేసారు టీమ్.
Also Read : Squid Game-2 : మరింత భయంకరంగా స్క్విడ్ గేమ్-2 టీజర్.. ఎలా ఉందో చూసారా..
దీపావళి సందర్బంగా ప్రోమోలో పద్దతిగా కనిపించారు హౌస్ మేట్స్. స్టార్టింగ్ లో హరితేజ ఓ సాంగ్ తో ప్రారంభించింది. అనంతరం అబ్బాయిలకి అమ్మాయిలకి ముగ్గుల పోటీ పెడతారు. తర్వాత హౌస్ లో ఓ ఫోన్ పెట్టి దానికి బిగ్ బాస్ ఫోన్ చేసి దీపావళి రోజు వాళ్ళు ఎంత అందంగా రెడీ అయ్యారో చెప్తాడు. అలా కాసేపు హౌస్ మేట్స్ అందరూ కలిసి డాన్స్ వేసాక బిగ్ బాస్ మళ్ళీ ఫోన్ చేసి దీపావళి ఎలా జరుగుతుంది..
హౌస్ లో మీ ప్రయాణం ఎలా ఉందని హౌస్ మేట్స్ ను అడుగుతారు. అప్పుడు రోహిణి దీపావళి సందర్బంగా మాకు 2 పాల పాకెట్స్ పంపండని జోక్ చేస్తుంది. అనంతరం హౌస్ మేట్స్ కి తమ ఇంటి నుండి వచ్చిన పలు స్పెషల్ వీడియో లను చూపిస్తారు. అలా వీడియోలను చూసిన ఇంటిసభ్యులు ఎమోషనల్ అయ్యారు. మొత్తానికి పండగ రోజు తమ కుటుంభ సభ్యులను చూపించాడు బిగ్ బాస్.