బాలీవుడ్‌కు సిగ్గు చేటు

బాలీవుడ్‌కు సిగ్గు చేటు

Updated On : December 18, 2019 / 2:31 AM IST

కొత్త పౌరసత్వపు చట్టంపై ఢిల్లీ నుంచి గల్లీ దాకా అసంతృప్తి వ్యక్తమవుతూనే ఉంది. సోషల్ మీడియా వేదికగా రచ్చలేపుతున్న నెటిజన్లు పలు రకాల హ్యాష్ ట్యాగులతో తమ ఉద్దేశ్యాన్ని వ్యక్తపరుస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలో ఏదైనా ఇబ్బంది కలిగితే ప్రజలతో పాటు సినిమా తారలు మమేకమై ప్రజా సమస్యలపై స్పందిస్తూ ఉంటారు. కానీ, ఢిల్లీలో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలలో విద్యార్థులపై పోలీసుల దాడి జరిగినా బాలీవుడ్ ఇండస్ట్రీ పట్టించుకోలేదు. 

దీనిపై స్టూడెంట్స్‌తో పాటు పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, దీపికా పదుకొనె, రణవీర్ సింగ్, ప్రియాంక చోప్రాతో పాటు ఎవ్వరూ ఈ ఘటనపై స్పందించలేదు. వీరిపై నిరాశ వ్యక్తం చేస్తూ #ShameonBollywood, #BollywoodKeBekaarBuddhe అంటూ ట్వీట్‌లు చేస్తున్నారు. 2012లో అమితాబ్ బచ్చన్ ఢిల్లీలో ప్రశాంత వాతావరణం కరువైందంటూ ట్వీట్ చేశాడు. దానిని రీ ట్వీట్ చేస్తూ.. ఇప్పుడేమైంది ఆ స్పందన అంటూ ప్రశ్నిస్తున్నారు. 

Citizenship Actకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఘటనలో ఢిల్లీలోని జామియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు దారుణంగా లాఠీ ఛార్జీ చేశారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఈ చట్టంపై విద్యార్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. ఘటనలో పలువురికి తీవ్ర గాయాలైయ్యాయి. విద్యార్థులపై జరుగుతున్న అరాచకానికి స్వచ్ఛందంగా స్పందిస్తూ ఐఐటీల నుంచి విద్యార్థులు కదిలివచ్చారు. 

పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో హింసాత్మక ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఈ చట్టంపై తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటికే పంజాబ్, కేరళ, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, వెస్ట్ బెంగాల్ సీఎంలు ఈ చట్టం అమలు చేయబోమని చేస్తున్న ప్రకటనలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. కేంద్ర ప్రభుత్వం తన అధికారాలను ఉపయోగడించి పొరుగుదేశాల్లో వేధింపులు ఎదుర్కొన్ని వచ్చిన శరణార్థులకు పౌరసత్వం ఇచ్చి తీరుతామన్నారు.