మాస్కులు తయారు చేస్తున్న కేంద్రమంత్రి భార్య

నోవెల్ కరోనా వైరస్.. రోజురోజుకు ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్న ఓ మహమ్మారి.. దీని దెబ్బకు ప్రతి ఒక్కరూ వణికిపోతుండగా,,, సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇప్పుుడు ఇళ్లకే పరిమితం అయిపోయారు. ఇటువంటి పరిస్థితిలోనే.. సాయం చేసేందుకు దాతలు సైతం ముందుకు వస్తున్నారు.
లేటెస్ట్ గా కిషన్‌రెడ్డి భార్య కావ్య కూడా మాస్కులు తయారుచేస్తున్నారు. వాటిని పంపిణీ చేసిన చిత్రాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు తన సతీమణి సమయాన్ని సద్వినియోగం చేస్తూ, ఇంట్లోనే మాస్కులు తయారు చేస్తుందంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.