Chiru – Pawan : కైకాల పార్థివదేహానికి నివాళ్లు అర్పించిన చిరు, పవన్..

తెలుగుతెర నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారు తుది శ్వాస విడిచారు. కాగా కైకాల పార్ధివదేహాన్ని చిరంజీవి, పవన్ కళ్యాణ్ సందర్శించుకొని ఆయన భౌతికకాయానికి నివాళ్లు అర్పించారు. కైకాల కుటుంబంతో ఇద్దరు మాట్లాడుతున్న సమయంలో చిరంజీవి ఎమోషనల్ అయ్యి కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు చిరు, పవన్.

Chiru – Pawan : కైకాల పార్థివదేహానికి నివాళ్లు అర్పించిన చిరు, పవన్..

Chiru and Pawan Pay last respects to Kaikala Satyanarayana

Updated On : December 23, 2022 / 2:17 PM IST

Chiru – Pawan : తెలుగుతెర నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారు తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కైకాల.. ఈరోజు ఉదయం కన్నుమూశారు. కైకాల మరణవార్తతో టాలీవడ్ లో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయన అకాల మరణానికి చింతిస్తూ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు మరియు రాజకీయ నాయకులు ఆయనకి సంతాపం తెలియజేస్తున్నారు.

Balakrishna : మా కుటుంబంతో కైకాల గారికి ప్రత్యేక అనుబంధం ఉంది.. బాలకృష్ణ!

కాగా కైకాల పార్ధివదేహాన్ని చిరంజీవి, పవన్ కళ్యాణ్ సందర్శించుకొని ఆయన భౌతికకాయానికి నివాళ్లు అర్పించారు. కైకాల కుటుంబంతో ఇద్దరు మాట్లాడుతున్న సమయంలో చిరంజీవి ఎమోషనల్ అయ్యి కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు చిరు, పవన్.

చిరంజీవి మాట్లాడుతూ.. “కైకాల కల్ముషం లేని వ్యక్తి, ఆయనతో పని చేస్తున్న సమయంలో ఒక చిన్న పిల్లవాడితో వర్క్ చేస్తున్నట్లు ఉంటుంది. అంతేకాదు ఆయన భోజన ప్రియుడు కూడా. ఇప్పుడు మనందర్నీ వదిలేసి వెళ్లిపోయారు, ఆయన ఎక్కడ ఉన్న ఆయన ఆత్మకి శాంతి కలగాలి” అంటూ కైకాల కుటుంబానికి తన సానుభూతుని తెలియజేశాడు. అలాగే కైకాల సత్యనారాయణ గారిని ప్రభుత్వం అధికారాల లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశాడు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “కైకాల సత్యనారాయణ గారిని మొదటిసారిగా మచిలీపట్నం ఎంపీ అయ్యినప్పుడు కలిశాను. ఆయన కంటే జూనియర్స్ ఆయనని ఏకవచనంతో పిలిచినా నొచ్చుకొని మనస్తత్వం ఆయనది. అందరికి అజాతశత్రువు అయిన కైకాల గారి మరణం సినీ పరిశ్రమకి తీరని లోటు. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతుని తెలియజేస్తున్నాను” అంటూ వ్యాఖ్యానించారు.