జైలుకెళ్లాడు..హీరోగా ఎలా చేస్తాడు ? యాంకర్ ప్రదీప్‌పై కేసు పెట్టిన డైరెక్టర్

  • Published By: madhu ,Published On : February 2, 2020 / 06:12 AM IST
జైలుకెళ్లాడు..హీరోగా ఎలా చేస్తాడు ? యాంకర్ ప్రదీప్‌పై కేసు పెట్టిన డైరెక్టర్

Updated On : February 2, 2020 / 6:12 AM IST

బుల్లితెర యాంకర్ ప్రదీప్‌పై బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు దాఖలైంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రదీప్ ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నాడంటూ యువకుడు ఫిర్యాదులో వెల్లడించారు. గతంలో ప్రదీప్ రెండు రోజుల జైలు శిక్ష అనుభవించాడని తెలిపాడు. ఇది నిబంధనలకు విరుద్ధం కాబట్టి నటుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై పోలీసులు స్పందించారు. న్యాయ సలహా తీసుకుని చర్యలు తీసుకుంటామని, కేసు నమోదు చేస్తామని పోలీసులు హామీనిచ్చారు. 

ఏమి జరిగింది..
ప్రదీప్..బుల్లితెర నటుడు. అనతికాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. యూత్‌లో ముఖ్యంగా అమ్మాయిలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ యాంకర్ తన తొలి సినిమా కోసం ఫ్యూర్ లవ్ స్టోరీని ఎంచుకున్నాడు. డిఫరెంట్ టైటిల్‌గా ప్రకటించారు. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. చిత్ర ఫస్ట్ లుక్ ఆకట్టుకొనే విధంగా ఉంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుగుతోందని తెలుస్తోంది. తాజాగా మూవీ ఫస్ట్ సాంగ్‌ను టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. గతంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి కౌన్సెలింగ్ తీసుకున్న సంగతి తెలిసిందే. తాజా ఫిర్యాదుతో ప్రదీప్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. 

Read More : నాకు కరోనా లేదు..తీసుకెళ్లండి..కర్నూలు యువతి సెల్ఫీ వీడియో