Upasana : ఇంత‌కు మించి ఇంకా ఏమీ వద్దు.. ఆనందంలో ఉపాస‌న‌.. క్లీంకార‌ను చూశారా..?

మెగా ప‌వ‌ర్‌ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) లు ఇటీవల తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. చిన్నారికి క్లీంకార (Klin Kaara) అని పేరు పెట్టారు.

Upasana : ఇంత‌కు మించి ఇంకా ఏమీ వద్దు.. ఆనందంలో ఉపాస‌న‌.. క్లీంకార‌ను చూశారా..?

Upasana - Klin Kaara

Updated On : September 1, 2023 / 7:05 PM IST

Upasana – Klin Kaara : మెగా ప‌వ‌ర్‌ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) లు ఇటీవల తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. దీంతో మెగా ఇంట ఆనందం వెల్లివిరుస్తోంది. చిన్నారికి క్లీంకార (Klin Kaara) అని పేరు పెట్టారు. ఇంటికి మ‌హాల‌క్ష్మీ వ‌చ్చింద‌ని మెగాస్టార్ చిరంజీవి ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్భాల్లో వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. కాగా.. చిన్నారికి సంబంధించిన ఫోటోల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానుల‌తో షేర్ చేసుకుంటున్నా కూడా ఆమె ముఖం క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

Yendira Ee Panchayithi : ‘ఏందిరా ఈ పంచాయితీ’ మూవీ నుంచి ‘ఏమో ఏమో’ సాంగ్ విడుదల..

తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ఉపాస‌న ఓ ఫోటోను షేర్ చేసింది. కూతురితో క‌లిసి మొద‌టి సారి వ‌ర‌ల‌క్ష్మీ వ‌త్రాన్ని చేసుకుంది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ అందుకు సంబంధించిన పిక్‌ను అభిమానుల‌తో పంచుకున్నారు. ‘ఇంత‌కు మించి ఇంకా ఏమీ వ‌ద్దు. నా క్లీంకార‌తో క‌లిసి మొద‌టి సారి వ‌ర‌ల‌క్ష్మీ వ‌త్రాన్ని చేసుకున్నాను.’ అంటూ రాసుకొచ్చింది. ఉపాస‌న ముఖంలో ఆనందాన్ని చూడొచ్చు. కాగా.. ఎప్ప‌టిలాగానే క్లీంకార ముఖాన్ని క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త తీసుకున్నారు. ఈ పిక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Bhagavanth Kesari : భగవంత్ కేసరి ఫస్ట్ సింగల్ వచ్చేసింది.. గణేష్ యాంతంకి బాలయ్య, శ్రీలీల..

ఇదిలా ఉంటే.. త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ (Shankar) డైరెక్ష‌న్ రామ్‌చ‌ర‌ణ్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే చాలా భాగం షూటింగ్ పూర్తి అయ్యింది.