మహాభారతం సినిమాకు ప్రభాస్‌ నో? రాజమౌళికి చెప్పేసిన రెబల్‌స్టార్‌? అదే కారణమా?

రాజమౌళితో సినిమా చేయను అని ప్రభాస్‌ చెప్పడానికి ప్రధానంగా బాహుబలి సినిమానే అని తెలుస్తోంది. ఎందుకంటే?

మహాభారతం సినిమాకు ప్రభాస్‌ నో? రాజమౌళికి చెప్పేసిన రెబల్‌స్టార్‌? అదే కారణమా?

దర్శక ధీరుడు రాజమౌళి మహాభారతం సినిమా తీయబోతున్నాడని.. అందులో బాహుబలి ప్రభాస్‌ నటించబోతున్నాడని ఎప్పటి నుంచో టాక్‌ వినిపిస్తోంది. ప్రభాస్‌ కల్కి తర్వాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉందంటారా? అంటే నో.. నో అనే సమాచారమే వస్తోంది… రాజమౌళి సినిమాలో సినిమాలో నటించేందుకు బాహుబలి సిద్ధంగా లేడనే వార్త టాలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. రాజమౌళితో సినిమాను ప్రభాస్‌ వద్దనుకోడానికి కారణమేంటి? వేరే ప్రాజెక్టు చేయబోతున్నాడా? ఇంకేమైనా ఉందా?

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కల్కి 2898 AD రిలీజ్‌ తర్వాత… నెక్ట్సేంటి? అన్న ప్రశ్న మొదలైంది. ఐతే రాజమౌళి తీయబోయే మహాభారతంలో ప్రభాస్‌ నటించనున్నారని చాలా కాలం నుంచి టాక్‌ వినిపిస్తోంది. కానీ, టాలీవుడ్ తాజా అప్డేట్‌లో రాజమౌళి సినిమాలో ప్రభాస్‌ నటించడం లేదనే సమాచారం హల్‌చల్‌ చేస్తోంది. ప్రభాస్‌తో రాజమౌళి మూడు చిత్రాలు చేశారు. ఈ మూడూ బ్లాక్‌ బస్టర్‌ సినిమాల్లో తొలుత ఛత్రపతి రిలీజ్‌ అవ్వగా, ఆ సినిమా బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాసింది.

ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో బాహుబలి రిలీజ్‌ అవ్వడం, ఆ సినిమా భారతీయ సినీ పరిశ్రమలో తెలుగు సినిమా రేంజ్‌ను అమాంతంగా పెంచేయడం అందరికీ తెలిసిందే… ఈ ఇద్దరూ కలిస్తే అప్పటివరకు ఉన్న రికార్డులు అన్నీ తెరమరుగై.. సరికొత్త రికార్డులు నమోదవుతాయని ఇండస్ట్రీలో అందరి నమ్మకం. అయితే ఇంతటి హిట్‌ కాంబినేషన్‌కు ప్రభాస్‌ నో చెప్పారన్న టాక్‌ ఎవరికీ అంతుచిక్కడం లేదు.

బాహుబలికి ఐదేళ్లు పట్టడంతో..
రాజమౌళితో సినిమా చేయను అని ప్రభాస్‌ చెప్పడానికి ప్రధానంగా బాహుబలి సినిమానే చెబుతున్నారు. బాహుబలి టు పార్ట్స్ చిత్రీకరణకు దాదాపు ఐదేళ్లు పట్టింది. ఈ ఐదేళ్లలో ప్రభాస్‌ మరే చిత్రంలోనూ నటించలేకపోయారు. ఆ కష్టానికి తగ్గట్టే భారీ హిట్‌ కొట్టినా… ఎక్కువ సమయం పట్టిందన్న అసంతృప్తిలో ప్రభాస్‌ ఉన్నారట… ఈ కారణంగానే మహాభారతాన్ని రిజక్ట్‌ చేస్తున్నట్లు చెబుతున్నారు.

దర్శక ధీరుడు ఆలోచనల్లో ఉన్న మహాభారతం సినిమాను 10 పార్టులుగా తీస్తారని ఇండస్ట్రీ టాక్‌. ఈ సినిమా పూర్తి చేయడానికి ఎలా లేదన్న పదేళ్ల సమయం పడుతుందని భావిస్తున్నారు. అంటే రాజమౌళితో సినిమాకు ఓకే చెబితే పదేళ్లు ప్రభాస్‌ మరే సినిమా చేయలేడని అంటున్నారు. అంత సమయం ఒకే సినిమాకు కేటాయించడం తన కెరీర్‌కు మంచిది కాదనే అభిప్రాయంతో మహాభారతంలో నటించకూడదని ప్రభాస్‌ అనుకుంటున్నట్లు చెబుతున్నారు.

Also Read: మహాభారతం రాజమౌళి తీస్తాడా? నాగ్ అశ్విన్ తీస్తాడా?

ఇప్పటికే తన నిర్ణయాన్ని రాజమౌళికి చెప్పాడని కూడా అంటున్నారు. దీనికి కల్కి సినిమాలో ఓ సన్నివేశాన్ని ప్రభాస్‌ వాడుకున్నట్లు చెబుతున్నారు. కల్కిలో గెస్ట్‌రోల్‌లో రాజమౌళి నటించారు. ఆ పాత్రలో ప్రభాస్‌ను పట్టుకునేందుకు రాజమౌళి ప్రయత్నిస్తే.. నేను నీకు చిక్కను, ఇప్పటికే ఐదేళ్లు బంధించేశావు… ఇప్పుడు నీతో కష్టం అన్న డైలాగ్‌ ఉంటుంది. దీనికి రాజమౌళి స్పందిస్తూ ఎంతకష్టమైనా నేను వదలను అన్న ఆన్సర్‌ ఇస్తాడు. కల్కి చిత్రంలో ఉన్న ఈ సంభాషణే ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఈ డైలాగ్‌ రాజమౌళి మహాభారతం సినిమాకు ఉద్దేశించిందేనని అంటున్నారు సినీ పండితులు.