HBD Chiru: చిరుకు గద్వాల్ అభిమాని ప్రత్యేక శుభాకాంక్షలు!

జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి ముగ్గురు యువకులు హైదరాబాద్ కు నడిచి వచ్చి హీరో రామ్ చరణ్ కలిసిన క్షణాలు గుర్తున్నాయా. రవి, వీరేష్, రాజ్ అనే ముగ్గురు

HBD Chiru: చిరుకు గద్వాల్ అభిమాని ప్రత్యేక శుభాకాంక్షలు!

Hbd Chiru

Updated On : August 20, 2021 / 7:36 PM IST

HBD Chiru: జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి ముగ్గురు యువకులు హైదరాబాద్ కు నడిచి వచ్చి హీరో రామ్ చరణ్ కలిసిన క్షణాలు గుర్తున్నాయా. రవి, వీరేష్, రాజ్ అనే ముగ్గురు యువకులు మెగా వీరాభిమానులు. అందుకే తమ అభిమాన హీరోలను చూడాలని.. ఒక యజ్ఞంలా ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి 231 కిలోమీటర్లు చెప్పులు కూడా ధరించకుండా కాలినడకన నడిచి నాలుగు రోజుల అనంతరం హైదరాబాద్ చేరుకుని రామ్ చరణ్ ను కలిశారు.

అప్పుడు అలా రామ్ చరణ్ ను కలిసిన ఆ అభిమానులే ఇప్పుడు మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి కోసం మరో స్పెషల్ ట్రీట్ ప్లాన్ చేశారు. ఆగష్టు 22న చిరంజీవి పుట్టినరోజు. కాగా, తమ అభిమాన హీరోకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలనుకున్న గద్వాల్ అభిమానులు అందుకోసం డ్రోన్ షాట్ లో ఓ చిరు ఫోటో కనిపించేలా నేల మీద గడ్డితో ఆకారాన్ని చెక్కించి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆ మధ్య సోనూసూద్ కు కూడా ఓ అభిమాని ఇదే తరహాలో శుభాకాంక్షలు చెప్పగా ఇప్పుడు గద్వాల్ అభిమాని ఇలా చిరంజీవికి ట్రిబ్యూ ఇచ్చాడు. నిజానికి ఈ అభిమాని పేదవాడైనా అభిమాన హీరో కోసం ఇలా భారీ ఖర్చు చేసి ఆర్ట్ తో శుభాకాంక్షలు చెప్పడం విశేషం. మరి, ఈ అభిమాని శుభాకాంక్షలు ఆ హీరో వరకు చేరి ఎలా స్పందిస్తారో చూడాలి.