సింగర్ ‘సిధ్ శ్రీరామ్’ పుట్టినరోజు.. టాప్ 5 సాంగ్స్ మీకోసం..

భారతీయ-అమెరికన్ సంగీత నిర్మాత, ప్లేబ్యాక్ గాయకుడు సిధ్ శ్రీరామ్ పేరు, ఆయన పాడిన పాటలు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులుండరు. అంత బాగా పాడుతారు. మెలోడీ సాంగ్స్ పాటలు పాడటంలో ఆయనకు ఆయన సాటి. ఇప్పటివరకూ ఆయన పాడిన పాటల్లో చాలా పాటలు సూపర్ హిట్ అయ్యాయి. దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రముఖ సినీగాయకుల్లో ఒకరిగా సిధ్ శ్రీరామ్ పేరుంది.
దర్శకుడు ధానా నిర్మించిన Vaanam Kottatum అనే మూవీతో శ్రీరామ్.. ప్లేబ్యాక్ సింగర్ నుంచి మ్యూజిక్ కంపోజర్‌గా కూడా రాణించారు. పాటకు ప్రాణం పోసినట్టుగా ఉంటుంది సిధ్ పాడుతుంటే.. అలాంటి గాత్రంతో తెలుగు, తమిళ్, మలళయాళం ఇలా పలు భాషల్లో పాటలు పాడుతూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఈ రోజు సిధ్ శ్రీరామ్ 30వ పుట్టినరోజు #HappyBirthday #SidSriram. ఆయన జన్మదినం సందర్భంగా సిధ్ పాడిన మెలోడీ సాంగ్స్‌లో Maruvaathai Pesathae పాట నుంచి Anbe Peranbae అనే పాట వరకు టాప్ 5 సాంగ్స్ మీకోసం అందిస్తున్నాం..
1. Maruvaathai Pesathae :
‘Maruvaathai Pesathae’ అనే ఈ పాట Enai Noki Paayum Thota తమిళ్ సినిమాలోనిది. హీరో ధనుష్, మేఘా ఆకాశ్ జంటగా నటించారు. తన మధురమైన గాత్రంతో ఈ పాటకు సిధ్ ప్రాణం పోశారు. దాదాపు మూడేళ్లగా ఈ పాటకు ఎంతమందిని అలరిస్తోంది. ధనుష్ మూవీ విడుదల ఆలస్యమైనప్పటికీ అందులోని ఈ పాట మాత్రం ఫుల్ పాపులర్ అయింది. ఎట్టకేలకు 2019లో థియేటర్లలో మూవీ విడుదలైంది.
2. High On Love :
High On Love … అనే ఈ పాట ‘Pyaar Prema Kaadhal’ అనే మూవీలోనిది. యువన్ శంకర్ కంపోజ్ చేసిన ఈ పాటకు సిధ్ శ్రీరామ్ తన గాత్రాన్నిఅందించారు. 2018లో ఎక్కువగా వినిపించిన High On Love అనే పాట అప్పట్లో ఊపు ఊపేసింది. అప్పటినుంచే శ్రీరామ్ రొమాంటిక్ సాంగ్స్ పాడటంలో మంచి పేరుంది. ఈ పాట వీడియోను చూస్తే ఎంత స్పెషల్ తెలుస్తుంది.. హరీష్ కల్యాణ్, రైజా విల్సన్ మధ్య స్వచ్ఛమైన రొమాన్స్ కు నిలువెత్తు సాక్ష్యంగా అనిపిస్తుంది.
3. Ennodu Nee Irundhaal :
ప్రముఖ తమిళ డైరెక్టర్ శంకర్ నిర్మించిన ‘I’ మూవీలో హీరోగా విక్రమ్, అమీ జాక్సన్ లీడ్ రోల్స్ పోషించారు. ఈ మూవీలో పాటలకు స్వర మాంత్రికుడు ఏ.ఆర్.రహమాన్ కంపోజ్ చేశారు. మాములుగా రహమాన్ మ్యూజిక్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంటుంది. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసిన Ennodu Nee Irundhaal అనే పాటకు సిధ్ శ్రీరామ్ తన గాత్రంతో మరింత క్రేజ్ తీసుకొచ్చారు. కబాలియన్ అనే లిరిక్ రైటర్ ఈ పాటకు లిరిక్స్ రాశారు. 2015లో ‘ఐ’ మూవీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మూవీ ఆశించిన స్థాయిలో లేకున్నా పాటలు మాత్రం బాగా పాపులర్ అయ్యాయి. అందులో సిధ్ పాడిన Ennodu Nee Irundhaal బాగా హిట్ అయింది.
4. Tharamae Tharamae :
తమిళ మూవీ ‘Kadaram Kondan’ నుంచి ‘Kadaram Kondan’ అనే రొమాంటిక్ సాంగ్ ఎంతో పాపులర్ అయింది. ఈ పాటను సిధ్ శ్రీరామ్ తన గాత్రంతో మరింత అందాన్ని తెచ్చారు. సంగీత దర్శకుడు ఘిబ్రాన్ స్వరపరిచిన ట్రాక్స్ తగినట్టుగా శ్రీరామ్ తన గాత్రాన్ని అందించారు. భార్యభర్తల మధ్య ప్రేమను వర్ణించే రొమాంటిక్ పాటకు సిధ్ ప్రాణం పోశారు. వివేకా దీనికి లిరిక్స్ రాశారు. 2019 మూవీలో ప్రమోషనల్ వీడియో కోసం ఈ పాటను విడుదల చేశారు. అప్పట్లో ఈ సాంగ్ ఎంతో హిట్ అయింది. సినీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది.
5. Anbe Peranbae :
2019లో తమిళంలో రిలీజ్ అయిన ‘NGK’ మూవీలో Anbe Peranbae అనే సాంగ్ ఫుల్ పాపులర్ అయింది. ఈ పాటకు సిధ్ శ్రీరామ్, శ్రేయా ఘోషల్ కలిసి పాడారు. సెల్వరాగవన్ కాంబినేషన్‌లో యువన్ శంకర్ రాజా కంపోజ్ చేసిన ఈ పాట ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. సిధ్ శ్రీరామ్ మ్యాజికల్ వాయిస్ బాగా సరిపోయింది. గత ఏడాదిలో సిధ్ పాడిన రొమాంటిక్ సాంగ్స్ ల్లో ఇదొకటిగా చెప్పవచ్చు. NGK మూవీలో హీరో సూర్య, సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు.